భవిష్యత్ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. కోటీశ్వరులు కావచ్చు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు కావచ్చు ఎవరి తాహతును బట్టివారికి ఫ్యూచర్ సెక్యూరిటీ ప్లానింగ్ అవసరం. కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాలవారికి వివిధ రకాల పొదుపు పథకాలు ప్రారంభించింది. అందులో ఒకటి మహిళలకై ప్రారంభించిన మహిళా సమ్మాన్ బచత్ యోజన.
2023 బడ్జెట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ బచత్ యోజనకు ఇటీవలి కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. మహిళల భవిష్యత్ సంరక్షణ కోసం ఈ పధకం ప్రారంభమైంది. ప్రస్తుతం వివిధ వర్గాల వారికి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఇలా ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవింగ్ పథకాల సరసన ఈ కొత్త పథకం వచ్చి చేరింది. ఏప్రిల్ 1వ తేదీ 2023 నుంచి ప్రారంభమైన ఈ కొత్త పధకం పట్ల మహిళలకు ఆకర్షితులౌతున్నారు.
కేవలం మహిళల కోసం ప్రారంభమైన మహిళా సమ్మాన్ బచత్ యోజనను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మహిళా సమ్మాన్ బచత్ యోజన అనేది ఒకేసారి పెట్టుబడి పెట్టే సేవింగ్ స్కీమ్. ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంటుంది. 2025 మార్చ్ వరకూ రెండేళ్ల కాలానికి వర్తిస్తుంది.
అత్యధిక వడ్డీ, జీరో రిస్క్
మహిళా సమ్మాన్ బచత్ యోజన పథకంపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల కాల పరిమితి కోసం మహిళలు లేదా అమ్మాయిల పేరుపై 2 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ యోజనలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు కాగా గరిష్టంగా 2 లక్షల రూపాయలుంటుంది. ఈ పథకం కింద ఓపెన్ చేసే ఎక్కౌంట్ సింగిల్ ఎక్కౌంట్ మాత్రమే ఉంటుంది. వార్షిక వడ్డీ 7.5 శాతం చొప్పన మూడు నెలలకోసారి జమ చేస్తారు.
విత్‌డ్రాయల్ సౌకర్యం
మహిళా సమ్మాన్ బచత్ యోజనలో జమ చేసిన తేదీ నుంచి అంటే రెండేళ్లు పూర్తయ్యాక మెచ్యూరిటీ ఉంటుంది. ఖాతాదారులు ఎక్కౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి ఏడాది తరువాత అంటే మెచ్యూరిటీ కంటే ముందే గరిష్టంగా 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవింగ్ పథకాలతో పోలిస్తే వడ్డీ అత్యధికంగా లభిస్తున్న పథకం ఇదే. వడ్డీతో పాటు సెక్యూరిటీ అంటే రిస్క్ లేనిది కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook