Bitcoin: బిట్​కాయిన్​ను గుర్తించే ప్రతిపాదనేది మా వద్ద లేదు: నిర్మలా సీతారామన్​

Government has no proposal to recognise Bitcoin as a currency: క్రిప్టో కరెన్సీలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో కీలక ప్రకటన చేశారు. బిట్​కాయిన్​ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని స్పష్టం చేశారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్​ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman)​ ఈ వివరణ ఇచ్చారు.

దీనితో పాటు బిట్​కాయిన్​ డేటాపై కూడా క్లారిటీ ఇచ్చారు నిర్మలా సీతారామన్​. బిట్​కాయిన్​ లావాదేవీల డేటాను ప్రభుత్వం సేకరించలేదని (Lok Sabha) స్పష్టం చేశారు.

ఏమిటి ఈ బిట్​కాయిన్​..

బిట్​కాయిన్ (Bitcoin) అనేది ఒక క్రిప్టో కరెన్సీ. బ్లాక్​ చైనా టెక్నాలజీ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఇది వర్చువల్ కరెన్సీ మాత్రమే. అంటే దీనిని డిజిటల్ రూపంలో మాత్రమే చూడగలం.. భౌతికంగా ఈ కాయిన్స్ ఉండవు.

2008లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎవరు రూపొందించారు అనే విషయంపై ఇంత వరకు స్పష్టమైన ఆధారాలు లేవు.

బిట్​కాయిన్​ను ఉపయోగించి వస్తు, సేవలకు చెల్లింపులు జరపొచ్చు. బ్యాంకులు, క్రెడిట్​కార్డుల సహా ఇతర పేమెంట్​ గేట్​వేలు లేకుండానే వీటి ద్వారా లావాదేవీలు జరిపే వీలుంది. ఇందుకు కారణం బిట్​కాయిన్​ కరెన్సీతో పాటు సొంత పేమెంట్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.

కొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే వీటి లావాదేవీలను అనుమతిస్తున్నాయి. సెంట్రల్​ అమెరికా దేశమైన ఎల్​ సాల్వడార్ బిట్​కాయిన్​ను అధికారిక కరెన్సీగా గుర్తించింది కూడా.

మరిన్నిసంస్థలు కూడా బిట్​కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల చెల్లింపులను అనుమతించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్​లో బిట్​కాయన్​ సహా క్రిప్టో కరెన్సీలపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ విషయంపై లోక్ సభలో నిర్మలా సీతారామన్​ స్పష్టతనిచ్చారు.

Also read: PM Modi On Omicron: ‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ హెచ్చరిక

Also read: Farm Laws Repeal Bill 2021: నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్​సభ ఆమోదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

English Title: 
No proposal to recognise Bitcoin as a currency, FM Nirmala Sitharaman says in a reply to Lok Sabha
News Source: 
Home Title: 

Bitcoin: బిట్​కాయిన్​ను గుర్తించే ప్రతిపాదనేది మా వద్ద లేదు: నిర్మలా సీతారామన్​

Bitcoin: బిట్​కాయిన్​ను గుర్తించే ప్రతిపాదనేది మా వద్ద లేదు: నిర్మలా సీతారామన్​
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

బిటికాయిన్​పై నిర్మలా సీతారామన్ క్లారిటీ

అధికారికంగా గుర్తించే ప్రతిపాదన లేదని వెల్లడి

లావాదేవీల డేటా సెకరించలేదని స్పష్టం

Mobile Title: 
Bitcoin: బిట్​కాయిన్​ను గుర్తించే ప్రతిపాదనేది మా వద్ద లేదు: నిర్మలా సీతారామన్​
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, November 29, 2021 - 16:52
Created By: 
Kotha Reddy
Updated By: 
Kotha Reddy
Published By: 
Kotha Reddy
Request Count: 
46
Is Breaking News: 
No