OYO Founder Ritesh Agarwal Wedding : ఓయోను స్థాపించి చిన్న వయస్సులోనే స్టార్టప్ బిజినెస్‌లో భారీ సక్సెస్ అందుకున్న రితేష్ అగర్వాల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అంతేకాదు.. తన పెళ్లి వేడుకను మరింత మధురం చేసేందుకు మార్చి 7 ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నాడు. బిలియనీర్ బిజినెస్‌మేన్ పెళ్లికి వచ్చే అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబాని వంటి ప్రముఖులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలే రితేష్ అగర్వాల్ తనకు కాబోయే భార్యతో పాటు తన తల్లిని కూడా తీసుకుని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. తన పెళ్లికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కోరాడు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానికి కూడా రితేష్ అగర్వాల్ పెళ్లికి ఆహ్వానం అందింది. ఓయో బిజినెస్ కి తమ సహకారం అందించిన ఎయిర్ బిఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖులు జాబితాలో ఉన్నారని సమాచారం.
ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి కూడా వచ్చే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ కథనం స్పష్టంచేసింది. థీల్ ఫెల్లోషిప్‌లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013 లో రితేష్ అగర్వాల్ ఓయో రూమ్స్‌ని స్థాపించాడు. అనతికాలంలోనే ఈ బిజినెస్ కాన్సెప్ట్ భారీగా సక్సెస్ అయింది. దీంతో బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి రితేష్ కి మద్దతు లభించింది.
రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడకు చెందిన మర్వాడి కుటుంబంలో జన్మించాడు. ఆరోజుల్లో రితేష్ కుటుంబం ఇక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. మొత్తానికి ఓయో బిజినెస్ సక్సెస్ అవడంతో రితేష్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఫేమస్ అయ్యాడు. అందుకే ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్ పెళ్లికి ఇప్పుడు వాణిజ్యవేత్తలు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగాడు.
ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్
ఇది కూడా చదవండి : Apple iPhone 15: యాపిల్ ఐఫోన్ 15 డిజైన్ లీక్.. ఊరిస్తున్న ఫీచర్స్
ఇది కూడా చదవండి : Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook