two wheeler loan : బైక్ కోనుగోలు చేస్తున్నారా.. వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేట్లు తెలుసుకోండి

two-wheeler loan :  రుణం కోసం బ్యాంక్‌ను సంప్ర‌దించే ముందు మీ రుణ అర్హ‌త తెలుసుకోవ‌డంతో పాటు.. వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎంఐలు ఎంత ఉంటాయో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 02:18 PM IST
  • రుణం కోసం బ్యాంక్‌ను సంప్ర‌దించే ముందు
    మీ రుణ అర్హ‌త తెలుసుకోండి
  • బ్యాంకులు అడిగే డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకోండి
two wheeler loan : బైక్ కోనుగోలు చేస్తున్నారా.. వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేట్లు తెలుసుకోండి

Planning to take a two-wheeler loan? Check out lowest interest rate, EMI: కోవిడ్‌-19 మన జీవ‌న విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం చాలా మంది ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌లో కంటే తమ సొంత వాహ‌నాల‌లో (own vehicle) ప్ర‌యాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది టూ వీల‌ర్ కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఫోర్ వీల‌ర్‌తో పోలిస్తే టూ వీల‌ర్ నిర్వ‌హణ ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బైక్స్ (Bikes) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే మీరు కూడా టూ వీల‌ర్ తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారా.. అందుకోసం  బ్యాంకు రుణం తీసుకోవాలనుకుంటున్నారా? రుణం కోసం బ్యాంక్‌ను సంప్ర‌దించే ముందు మీ రుణ అర్హ‌త తెలుసుకోవ‌డంతో పాటు.. వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎంఐలు (EMI) ఎంత ఉంటాయో ఒకసారి చూడండి. సాధార‌ణంగా బ్యాంకులు వాహ‌నం విలువ‌లో 90శాతం వ‌ర‌కు రుణం ఇస్తాయి. మిగిలిన 10 శాతం డౌన్‌పేమెంట్‌ కింద కొనుగోలుదారుడు చెల్లించాల్సి ఉంటుంది.  

ముందుగా టూ వీలర్‌‌  (two wheeler) లోన్‌ కోసం కావ‌ల‌సిన ప‌త్రాలు అన్నీ చెక్ చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు ఐడెండిటి ప్రూఫ్(పాన్ కార్డు, ఓట‌ర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌), అడ్ర‌స్ ఫ్రూఫ్‌ (యుటిలిటి బిల్స్‌, పాస్‌పోర్ట్‌), ఆదాయ ప్రూఫ్‌కు సంబంధించి ఉద్యోగ‌స్తులైతే పేస్లిప్‌, ఐటి రిట‌ర్నులు బ్యాంకు స్టేట్‌మెంటులు, ఉద్యోగ‌స్తులు కాని వారు అయితే ఐటి రిట‌ర్నులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆడిట్ ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంటులు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే త‌క్కువ వ‌డ్డీ రేటుకే మనకు టూ వీలర్‌‌ రుణం లభించాలంటే క్రెడిట్ స్కోరు (credit score) ముఖ్య పాత్ర పోషిస్తుంది. 750 కంటే త‌క్కువ స్కోరు ఉన్న వారి ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాంకులు తిర‌స్క‌రించే అవకాశం ఉంటుంది. లేదంటే అధిక వ‌డ్డీతో రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు క‌నీస వ‌య‌సు 21 సంవ‌త్స‌రాలుంటే చాలు. గ‌రిష్టంగా 65 నుంచి 70 సంవ‌త్స‌రాలు ఉండొచ్చు. నెల‌వారి ఆదాయం కనీసం 6వేలు రూపాయలుండాలి.

Also Read : Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ ఎంతవరకూ క్షేమకరం, కొత్త ఆరోపణలు

టూ వీలర్‌‌ల (two wheeler) కోసం పలు బ్యాంకులు రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు, ఈఎంఐల వివరాలు ఇలా ఉన్నాయి. 

యుకో బ్యాంక్‌ - వార్షిక వడ్డీ రేటు 7.20శాతం, ఈఎమ్ఐ - రూ.3,097 ప్రకారం టూ వీలర్ లోన్ అందజేస్తోంది. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వార్షిక వడ్డీ రేటు 7.25శాతం, ఈఎమ్ఐ - రూ.3,099  ప్రకారం టూ వీలర్ లోన్ అందజేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా - వార్షిక వడ్డీ రేటు 7.35శాతం, ఈఎమ్ఐ - రూ.3,104 ప్రకారం టూ వీలర్ లోన్ ఇస్తోంది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.45శాతం, ఈఎమ్ఐ - రూ.3,154 ప్రకారం టూ వీలర్‌‌ లోన్‌ అందజేస్తోంది. జ‌మ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.70శాతం, ఈఎమ్ఐ - రూ.3,166 ప్రకారం టూ వీలర్ లోన్ ఇస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.80శాతం, ఈఎమ్ఐ - రూ.3,171 ప్రకారం టూ వీలర్‌‌ లోన్‌ అందజేస్తోంది.
కెన‌రా బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9శాతం, ఈఎమ్ఐ - రూ.3,180, 
ఐడిబిఐ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9.80శాతం, ఈఎమ్ఐ - రూ.3,217, 
యూనియ‌న్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9.90శాతం, ఈఎమ్ఐ - రూ.3,222, 
బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర - వార్షిక వడ్డీ రేటు 10.05శాతం, ఈఎమ్ఐ - రూ.3,229, 
ఇండియన్ ఓవ‌ర్‌సీస్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.05శాతం, ఈఎమ్ఐ - రూ.3,229, 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)- వార్షిక వడ్డీ రేటు 10.25శాతం, ఈఎమ్ఐ - రూ.3,238, 
యాక్సిస్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.80శాతం, ఈఎమ్ఐ - రూ.3,264, 
సౌత్ ఇండియన్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.95శాతం, ఈఎమ్ఐ - రూ.3,272,
 బ్యాంక్ ఆఫ్ బ‌రోడా - వార్షిక వడ్డీ రేటు 11శాతం, ఈఎమ్ఐ - రూ.3,274 ప్రకారం టూ వీలర్‌‌ లోన్‌ అందజేస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం బ్యాంకులు (banks) ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లు. బ్యాంకులు ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది.

Also Read : United Nations: ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ను తప్పుబట్టిన భారత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News