Reliance Jio IPO: దేశంలోని ప్రైవేట్ టెలీకం రంగంలో దిగ్గజంగా ఉన్న రిలయన్స్ జియో త్వరలో షేర్ మార్కెట్‌లో సంచలనం రేపేందుకు సిద్ధమౌతోంది. రిలయన్స్ జియో నుంచి త్వరలో ఐపీవో రానుంది. ఐపీవో ద్వారా 40 వేల కోట్ల సమీకరించాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది. అదే జరిగితే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది.
రిలయన్స్ జియో నుంచి కొత్తగా ఐపీవో మార్కెట్‌లో ఎంట్రీ కానుంది. ఈ ఏడాది రెండవ టర్మ్ తరువాత ఐపీవో కోసం జియో సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 35 వేల నుంచి 40 వేల కోట్ల సమీకరించే ఆలోచనలో రిలయన్స్ జియో ఉంది. ఇప్పటి వరకూ 27,870 కోట్లు సమీకరించి హ్యుండయ్ మోటార్స్ అతి పెద్ద కంపెనీగా నిలిచింది. 2024 అక్టోబర్‌లో హ్యుండయ్ ఐపీవో వచ్చింది. దేశంలో రిలయన్స్ జియో 46 కోట్ల కస్టమర్లతో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో లాభంలో ఉంది. అటు కంపెనీ నికర లాభం కూడా 14 శాతం పెరిగింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 6,231 కోట్లు సంపాదించింది. జియో వార్షిక ఆదాయం 15, 036 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2023లో లిస్టెడ్ అయింది. జూలైలో మూల సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిపోయింది. ఆ తరువాత రిలయన్స్ జియో ఫైనాన్షియల్ షేర్ ధర డిస్కవరీ మెకానిజంలో భాగంగా 261.85 రూపాయలుగా నిర్ణయించారు. బీఎస్ఈలో 265 రూపాయలు లిస్ట్ అయితే ఎన్ఎస్ఈలో 262 రూపాయలకు లిస్ట్ అయింది. ఆ తరువాత ఈ రెండూ 304 రూపాయలకు చేరుకున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలీకం విభాగం రిలయన్స్ జియో ఐపీవో విడుదల కానుంది. ఈ ఏడాది జూన్ తరువాత ఐపీవో స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.