SBI Superhit Scheme: ఎస్పీఐ లాంచ్ చేసిన ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సూపర్ హిట్ పథకంగా చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్లు ఈ పధకంలో ఎఫ్‌డి చేస్తే అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు. రెట్టింపు లాభాన్నిచ్చే ఈ పధకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎస్పీఐ సూపర్ హిట్ డిపాజిట్ స్కీమ్ ఇది. ఈ పథకం మెచ్యూరిటీ 7 రోజుల్నించి 10 ఏళ్ల వరకూ ఉంటుంది. మెచ్యూరిటీ కాలాన్ని బట్టి రిటర్న్స్ మారుతాయి. వయస్సు పెరిగే కొద్దీ సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ తగ్గించుకుంటారు. రిస్క్ ఉందనుకునే చోట ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. సీనియర్ సిటిజన్లు అయితే ఏ మాత్రం రిస్క్ తీసుకోరు. సీనియర్ సిటజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే బ్యాంకులు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా ఎస్బీఐ సీనియర్ సిటజన్లకు టెర్మ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అందిస్తోంది. ఇటీవల రిటైర్ అయి చేతిలో డబ్బులుంటే ఎస్బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి స్కీమ్ మంచి లాభాన్నిస్తుంది.
ఎస్బీఐ అందిస్తున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో మెచ్యూరిటీ కాలం 7 రోజుల్నించి మొదలై 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా కనీసం 0.5 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 5-10 ఏళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే 1 శాతం అదనంగా వడ్డీ అందుతుంది.
ఎస్బీఐ సాధారణంగా వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5-10 ఏళ్ల కాలానికి 6.5 వడ్డీ రేటు ఇస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఎస్పీఐ వి కేర్ డిపాజిట్ పధకంలో అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది.
పదేళ్లలో 10 లక్షలు కాస్తా 21 లక్షలౌతుంది..ఎలాగంటే
సీనియర్ సిటిజన్లు ఒకేసారి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల మెచ్యూరిటీ తరువాత అతనికి 21,02,349 రూపాయలు చేతికి అందుతాయి. అంటే ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందుతుంది. అంటే సీనియర్లు సిటిజన్లు డిపాజిట్ చేసే మొత్తానికి అదనంగా 11,02,349 రూపాయలు వడ్డీ రూపంలోనే జమ అవుతుందన్న మాట.
ఎస్బీఐ ఇటీవలే వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. ఇది 2023 ఫిబ్రవరి 15 నుంచి 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తించడం మొదలైంది. రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినట్టే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కూడా పెరిగింది.
బ్యాంకుల్లో పెట్టే ఫిక్స్డ్ లేదా టెర్మ్ డిపాజిట్లు అత్యంత సురక్షితం. ఇన్వెస్టర్లకు ఇందులో రిస్క్ ఉండదు. సెక్షన్ 80 సి ప్రకారం 5 ఏళ్ల ఎఫ్‌డిలో ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఐటీ నిబంధనల ప్రకారం ఎఫ్ డి పథకాలపై టీడీఎస్ ఉంటుంది. ఎఫ్‌డిలపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ నుంచి మినహాయింపు కోసం ఫారమ్ 15జి లేదా 15 హెచ్ సమర్పించాల్సి ఉంటుంది.
Also read: PM Kisan Status: రేపే అకౌంట్‌లోకి డబ్బులు జమ.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook