SIP Types: ఎస్ఐపీలో ఎన్ని రకాలున్నాయి, ఎవరికి ఏది ప్రయోజనం

SIP Types: షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చాలా మార్గాలున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఎస్ఐపీ. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. చాలామందికి ఎస్ఐపీలో ఎన్నిరకాలుంటాయి, ప్రయోజనాలేంటనేది తెలియదు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2025, 12:40 PM IST
 SIP Types: ఎస్ఐపీలో ఎన్ని రకాలున్నాయి, ఎవరికి ఏది ప్రయోజనం

SIP Types: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఏ రకమైన పెట్టుబడిదారులకైనా ఇది ప్రయోజనంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న మొత్తాలతోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. స్వల్పకాలం, దీర్ఘకాలానికి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఎస్ఐపీలో కూడా చాలా రకాలుంటాయి. ఎలాంటి ఎస్ఐపీ మంచిదో తెలుసుకుందాం.

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో మీరు పెట్టే పెట్టుబడిని మ్యూచ్యువల్ ఫండ్స్‌లో నిర్దేశిత వ్యవధిలో, నిర్ణయించిన మొత్తాన్ని క్రమక్రమంగా పెడుతుంటారు. ఇది రోజుకు, వారానికి లేదా నెలకు, మూడు నెలలకు ఉంటుంది. ఎస్ఐపీలో చాలా రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైంది ఫ్లెక్సీ ఎస్ఐపీ. ఇందులో ఇన్వెస్టర్లు ప్రతి నెలా పెట్టుబడి మొత్తాన్ని పెంచడం లేదా తగ్గించడానికి అవకాశముంటుంది. అంటే ఇన్వెస్టర్ల ఆదాయం, ఖర్చుల్ని బట్టి ఉంటుంది. ఇక రెండవది టాప్ అప్ ఎస్ఐపీ. ఈ విధానంలో ఇన్వెస్ట్రర్ ప్రతి నెలా పెట్టుబడిని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. ఆదాయం పెరిగినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెంచాలనుకునేవారికి ఇది చాలా అనువైంది. 

పెర్పెట్యువల్ ఎస్ఐపీ. ఈ విధానంలో ఇన్వెస్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. లిమిట్ ఉండదు. ఎప్పటి వరకైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మరో విధానం స్టెప్ అప్ ఎస్ఐపీ. ఇన్వెస్టర్లు ఏడాదికోసారి కొద్ది మొత్తం క్రమ క్రమంగా పెంచుకునేందుకు వీలుంటుంది. ఎస్ఐపీ మొత్తం పెంచుకోవచ్చు. టార్గెట్ బేస్డ్ ఎస్ఐపీ. ఈ విధానాన్ని ఇళ్లు కొనడం, పిల్లల చదువు లేదా పదవీ విరమణను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇక మైక్రో ఎస్ఐపీ మరో విధానం. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టలేనివారికి ఇది ఉపయోగం. ఇందులో 500 రూపాయలు అంతకంటే తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్ చేయవచ్చు. అందరికీ అనువైంది ఇది.  

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడూ మార్కెట్ స్థితిగతులు, ఫండింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అనేవి సగటున ఇచ్చిన రిటర్న్స్ 12-15 శాతమున్నాయి. అంటే పదేళ్లకు నెలకు 5000 పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి 6 లక్షలు అవుతుంది. కానీ మీరు కనీసం 11.6 లక్షలు పొందవచ్చు. ఎస్ఐపీ అనేది నూటికి నూరు శాతం రిస్క్ లేనిది కానేకాదు. ఇందులో రిటర్న్స్‌తోపాటు రిస్క్ కూడా ఉంటుంది. అది పరిగణలో తీసుకునే ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. 

Also read: AP Aarogyasri Services: భారీగా బకాయిలు, రేపట్నించి ఆగిపోతున్న ఆరోగ్య శ్రీ సేవలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News