Car price hike: కార్ల తయారీ దారు కంపెనీలు ఒక్కొక్కటిగా కార్ల ధరలను పెంచుతున్నాయి. కొత్త ఏడాది నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీలైన మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా, ఎంజీ మోటార్స్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్, కియా కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంచిన ధరలు జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
కార్ల తయారీదారులు వచ్చే నెల నుండి ధరల పెంపును అమలు చేయడానికి ప్రధాన కారణం ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడం. ఏదేమైనప్పటికీ, కొత్త సంవత్సరంలో వాహనాలను కొనుగోలు చేయడానికి కస్టమర్లు కొనుగోలును తర్వాత నెలల వరకు వాయిదా వేయడంతో, సంవత్సరం చివరి నెలలో విక్రయాల పరిమాణాన్ని పెంచడానికి వాహన తయారీదారులు ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ కసరత్తు చేస్తారని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
ఇక తమ ప్రయాణికుల వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ కూడా తెలిపింది. విద్యుత్ వాహనాల ధరలు కూడా పెంచుతున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరో ఆటోమొబైల్ కంపెనీ కియా కూడా జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలను 2శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ముడిసరుకు ధరలు పెరగడం, సప్లయ్ చైన్ వ్యయాలు అధికం అవ్వడం కారణంగా ధరల పెంపు తప్పడం లేదని తెలిపింది. ఇప్పటి వరకు దేశీయంగా 16లక్షల యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూ
స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook