Union Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకునే బడ్జెట్ నిర్ణయాల కారణంగా పలు ఫెర్టిలైజర్ కంపెనీలు లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ 5 ఫర్టిలైజర్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (Chambal Fertilisers and Chemicals Ltd):
చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ దేశంలోనే అగ్రగామి ఫర్టిలైజర్ కంపెనీల్లో ఒకటి ఇది యూరియా, డి-అమోనియం ఫాస్ఫేట్ (DAP) ప్రధాన తయారీదారుగా ఉంది. కంపెనీకి టెక్స్‌టైల్, షిప్పింగ్ , సాఫ్ట్‌వేర్ రంగాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. కోటా, రాజస్థాన్‌కు చెందిన ఈ సంస్థ KK బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో ఒకటి. 1985లో స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలోని అతిపెద్ద యూరియా తయారీదారులలో ఒకటి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,000 కోట్లుగా ఉంది. ఈ సంస్థ షేర్ ధర ప్రస్తుతం 490 రూపాయల వద్ద ఉంది. గడిచిన ఏడాది కాలంగా ఈ షేరు 81 శాతం పెరిగింది.
కోరమాండల్ ఇంటర్నేషనల్ (Coromandel International):
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువులు, ప్రత్యేక పోషకాలు, సేంద్రీయ కంపోస్ట్ తయారీలో నిమగ్నమై ఉన్న సంస్థ. ఆరు దశాబ్దాల క్రితం అమెరికాకు చెందిన IMC, అలాగే భారత్ కు చెందిన EID ప్యారీ సహకారంతో స్థాపించారు. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ భారతదేశంలోని ప్రసిద్ధ ఫర్టిలైజర్ సంస్థల్లో ఒకటిగా పేరుంది. సంస్థ ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 25,000 కోట్లు. ప్రస్తుతం కంపెనీ షేరు 1593 రూపాయల వద్ద ఉంది. గడిచిన ఏడాది కాలంగా ఈ కంపెనీ షేరు 65 శాతం పెరిగింది.
గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(Gujarat Narmada Vly Frtlzrs & Chmcl Ltd):
గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (GNFC) NARMADA బ్రాండ్ క్రింద యూరియా, అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్ వంటి వివిధ ఎరువులను తయారు చేస్తుంది. 1976లో స్థాపించిన ఈ సంస్థ. గుజరాత్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ , గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో నెలకొల్పారు. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,000 కోట్లు, ఇది భారతదేశంలోనే టాప్ ఫెర్టిలైజర్ కంపనీల్లో ఒకటి. ఈ సంస్థ ప్రస్తుత షేర్ ధర రూ. 660, గడిచిన ఏడాది కాలంగా ఈ కంపెనీ షేరు 10 శాతం లాభపడింది.
దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ( Deepak Frtlsrs and Ptrchmcls Corp Ltd):
దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DFPCL) నైట్రిక్ యాసిడ్, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ (ఫార్మా , ఇండస్ట్రియల్ అవసరాల కోసం) , ఫుడ్-గ్రేడ్ లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ వంటి పారిశ్రామిక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశీయంగా IPA , ఇతర రసాయనాలను దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తుంది. DFPCL మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా , గుజరాత్‌లలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కంపెనీ షేర్ ధర ప్రస్తుతం రూ. 745 గా ఉంది. ఈ కంపెనీ షేర్లు గడిచిన 1 సంవత్సరం కాలంలో 23 శాతం పెరిగాయి.
టాటా కెమికల్స్ లిమిటెడ్(Tata Chemicals Ltd) :
టాటా కెమికల్స్ లిమిటెడ్ (TCL) ప్రపంచంలోనే సోడా యాష్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. సోడియం బైకార్బోనేట్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఆరవ స్థానంలో ఉంది. 1927లో స్థాపించిన ఈ సంస్థను 1939లో JRD టాటా నాయకత్వంలో టాటా గ్రూప్‌లో విలీనమైంది. TCL మార్కెట్ ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్ , ఆఫ్రికా అంతటా విస్తరించింది. ఈ కంపెనీ షేరు ధర ప్రస్తుతం 1044 రూపాయలుగా ఉంది. ఈ షేరు గడిచిన 5 సంవత్సరాల్లో 300 శాతం పెరిగింది.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి