Balakrishna:బాలకృష్ణ ని చూసి బాలీవుడ్ నటులు నేర్చుకోవాలి… హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్..

Balakrishna:వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసున్న మిగతా తెలుగు హీరోలు కనీసం యావరేజ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం వరసగా మూడు సూపర్ హిట్ లో అందించారు. అలాంటి బాలయ్య గురించి ఇప్పుడు ఒక ప్రముఖ నటి వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 04:45 PM IST
Balakrishna:బాలకృష్ణ ని చూసి బాలీవుడ్ నటులు నేర్చుకోవాలి… హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్..

Payal Ghosh:ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరసగా సూపర్ హిట్లు అందుకుంటూ హవా కొనసాగిస్తూ ఉండేది  ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అన్ స్టాపబుల్ షో తో నిజంగానే అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు మన బాలయ్య.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరసగా సూపర్ హిట్లు అందుకున్నారు. అంతకుముందు కూడా సింహ, లెజెండ్, లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో ఎప్పుడూ పోటీ ఉండేది చిరంజీవికి ..ఇక బాలకృష్ణకే. వీరిద్దరిలో టాప్ వన్ ప్లేస్ ఎవరికి వస్తుంది అని చాలా రోజులు పోటి పడ్డారు. కానీ గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు చిరంజీవికి సూపర్ హిట్లు రావడంతో మెగాస్టార్ టాప్ వన్ పొజిషన్ చేరుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ లెక్కలు తారుమారు అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాలు కలెక్షన్స్ పరంగా నిరాశ పరుస్తుండగా బాలకృష్ణ సినిమాలు మాత్రం యమ జోరుగా దూసుకుపోతున్నాయి. అంతేకాదు ప్రేక్షకులను కూడా బాలయ్య ఆకట్టుకున్నట్టు చిరంజీవి ఆకట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలు చేయడం లేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉండగా బాలకృష్ణ మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు అని ఎంతోమంది మెచ్చుకుంటూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందీ హీరోలు సైతం మన బాలకృష్ణ అని చూసి నేర్చుకోవాలి అని ఒక హీరోయిన్ అనడం వైరల్ అయింది.

అసలు విషయానికి వస్తే నటి పాయల్ ఘోష్ నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తిన వేసుకుంటుంది. ముఖ్యంగా ఆమెకు ఒక హీరో నచ్చితే వారిని తెగ పొగిడేయడం అలానే తనకు నచ్చని వారిని తిట్టడం ఈ హీరోయిన్ కి అలవాటు. కాగా ఈ హీరోయిన్ తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. మనోజ్ ప్రయాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఊసరవెల్లి సినిమాతోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది.

అంతేకాదు ఈమె జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ తప్పకుండా ఇంటర్నేషనల్ స్టార్ అవుతారని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాక ముందే చెప్పేసింది ఈ హీరోయిన్. ఇక ముఖ్యంగా ఈ హీరోయిన్ తనకు ఛాన్స్ దొరికితే చాలు బాలీవుడ్ మీద ఏదో రకంగా కౌంటర్లు వేస్తూనే వస్తుంటుంది. తాజాగా మరోసారి అలాంటి ఒక సంచలన పోస్ట్ వేసింది. బాలయ్య ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హిట్లు ఇస్తున్నారు.. ఆయన్ను చూసుకుని బాలీవుడ్ నటులు ఎంతో నేర్చుకోవాలని పోస్ట్ వేసింది.

ఇక తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పక్క ఇండస్ట్రీ నుంచి కూడా బాలకృష్ణ ఇలాంటి కామెంట్లు అందుకోవాలని ఆయన అభిమానులు తెగ ఖుషి గా ఉన్నారు.

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News