Allu Aravind Counter to Tollywood Heros at ali tho saradaga show: ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అనేక సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్న అల్లు అరవింద్ తర్వాతి కాలంలో చాలామంది హీరోలతో కూడా సినిమాలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని యంగ్ బ్లడ్ కు అవకాశం కల్పిస్తూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్థాపించి బన్నీ వాసు చేత సినిమాలు నిర్మింప చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఈతరం హీరోల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికర వ్యాఖ్యలు అనడం కంటే ఒక రకంగా ఆయన కౌంటర్ వేశారనే చెప్పాలి. ఆలీ మీరు ఒక నటుడి కుమారుడు కదా మీరు కూడా నటుడు అవ్వాలని ఎందుకు అనుకోలేదు ఎందుకు నిర్మాణరంగం వైపు వెళ్లారు? అని ప్రశ్నిస్తే దానికి అల్లు అరవింద్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అదేమిటంటే తాను ఒక ఉద్యోగిగా ఉండాలనుకోలేదని ఒక ఉద్యోగికి జీతం ఇచ్చేవాడిగా ఉండాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు.
ఒక నటుడు అంటే జీతం తీసుకోవాలి కానీ నిర్మాత అంటే నలుగురు నటులకు ఇతర టెక్నీషియన్లకు జీతం ఇచ్చే పొజిషన్ కాబట్టి నేను నిర్మాత అవ్వాలని అనుకున్నాను అని అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని ఆయన అన్నారు. సరదాగానే అంటున్నాను ఇది ఆలీతో సరదాగా షో కాబట్టి అని అంటూనే ఆయన ఈతరం హీరోల మీద కౌంటర్లు వేశారు. ఒకప్పుడు నిర్మాత హీరోలకి పని ఇచ్చేవారని కానీ ఇప్పుడు హీరోలే నిర్మాతలకు పని ఇస్తున్నట్లుగా ఫీలవుతున్నారని చెప్పుకొచ్చారు.
అలాగే ఒకప్పుడు నిర్మాతలు ఫలానా హీరో దగ్గరికి వెళ్లి మా సినిమా చేస్తారా అని అడిగే వారిని ఇప్పుడు హీరోలే కథలు ఫైనల్ అయిన తర్వాత ఫలానా నిర్మాతతో సినిమా చేద్దామని ముందుకు వెళుతున్నారని అర్థం వచ్చేలా ఆయన కామెంట్లు చేశారు. అయితే ఆయన సొంత కుమారుడు అల్లు అర్జున్ అలాగే చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా ఇద్దరూ సినిమా హీరోలే. అయినా ఆయన హీరోల మీద చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే ఆయన కామెంట్ చేశారని కాదు కానీ సినీ పరిశ్రమలో పరిస్థితి కూడా ఒక రకంగా ఇలాగే ఉందనే కామెంట్స్ చాలా కాలం నుంచి ఉన్నాయి.
ఒకప్పుడు సినీ నిర్మాత కథ విన్న తర్వాత ఆ కథకు తగ్గ హీరో ఎవరు అని వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళకి కథలు వినిపించే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు కథ మొదట హీరో దగ్గరికి వెళితే ఆ బడ్జెట్ కి తగిన నిర్మాత ఎవరు అనే విషయాన్ని హీరోనే ఫైనల్ చేసి సదరు నిర్మాతల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ ఇప్పుడు ఆసక్తికరంగా యంగ్ హీరోలకి కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: RGV on Garikapati: గరికపాటికి పద్మ కూడా ఎక్కువే.. పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు? వర్మ సంచలన ట్వీట్లు
Also Read: Court Notices to Prabhas: 'ఆదిపురుష్'కు మరో షాక్.. ప్రభాస్ సహా సినిమా యూనిట్ కు లీగల్ నోటీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook