AP flood victims: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అల్లు అరవింద్ విరాళం

Allu Aravind donation to AP CM relief fund: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో చిత్తూరు జిల్లాలోని నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం జల ప్రళయంలో చిక్కుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 03:18 AM IST
AP flood victims: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అల్లు అరవింద్ విరాళం

Allu Aravind donation to AP CM relief fund: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో చిత్తూరు జిల్లాలోని నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం జల ప్రళయంలో చిక్కుకుంది. తిరుపతితో పాటు తిరుపతి చుట్టూ ఉన్న పరిసరాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు, వరదల (Heavy rains in AP) కారణంగా కొన్ని చోట్ల ఆలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో ఎన్నో కుటుంబాలు నివాసం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ( Floods in AP) ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. వరద బాధితుల సహాయార్థం ఆర్థిక సహాయం అందించి నిధులు విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

ఇదిలావుంటే, తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం అందిస్తున్నట్టు అల్లు అరవింద్ (Allu Aravind's donation) ప్రకటించారు. తిరుపతిలో వరద బాధితుల సహాయక చర్యల నిమిత్తం ఈ విరాళం అందిస్తున్నట్టు గీతా ఆర్ట్స్ టీమ్ వెల్లడించింది.

Trending News