Pushpa 2: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ అప్పుడే.. సంబరపడిపోతున్న అల్లు అర్జున్ ఫాన్స్

Pushpa 2 Update: వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న  సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించి  సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేయబోతున్నారట.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2024, 03:00 PM IST
Pushpa 2: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ అప్పుడే.. సంబరపడిపోతున్న అల్లు అర్జున్ ఫాన్స్

Allu Arjun: పుష్ప.. సైలెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద వైలెంట్ రికార్డులు సృష్టించిన చిత్రం. ఈ మూవీతో అల్లు అర్జున్ స్టార్ డమ్ వరల్డ్ వైడ్ వ్యాపించింది. ముఖ్యంగా ఈ మూవీ లో పాటలు మంచి గుర్తింపు తెచ్చుకొని బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం పాటలకు స్టెప్పులు వేసి సెలబ్రిటీలు సైతం మురిసిపోయారు. భారీ అంచనాలను సృష్టించిన ఈ మూవీ నుంచి సీక్వెల్ త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ఒక టీజర్,పోస్టర్ తప్ప మరింక ఎటువంటి అప్డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ అందించబోతున్నారు పుష్ప చిత్ర బంధం.

ఆగస్టులో ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో మూవీ నుంచి భారీ అప్డేట్స్ ను అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఈ మూవీ నుంచి చిత్ర బృందం ఓ క్రేజీ అప్డేట్ ను ఇవ్వడానికి రెడీ అయిపోయారు అని టాక్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా.. పుష్ప మూవీ టీం అభిమానులకు మంచి ట్రీట్  ఇవ్వనున్నారు. పుష్ప 1 సెన్సేషనల్ మ్యూజిక్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రాక్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప మూవీ నుంచి మొదటి పాట విడుదలవుతుంది అని అందరూ ఆశిస్తున్నారు.

అయితే బర్త్డే గిఫ్ట్ గా పాటను విడుదల చేస్తారా? లేక మరి ఇంకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా ?అన్న విషయం పై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఆరోజు పుష్ప మూవీ నుంచి ఓ భారీ సర్ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పుష్ప 1 మూవీ టైంలో ప్రమోషన్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే ఈసారి మాత్రం అదరగొట్టే రేంజ్ ప్రమోషన్స్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారట. రాజమౌళి మూవీ ప్రమోషన్ రేంజ్ కు ధీటుగా పుష్ప 2 ప్రమోషన్ ఉండబోతోందని సమాచారం. విడుదల సమయానికి గట్టి పోటీ లేనట్లయితే బాహుబలి రికార్డులను పుష్ప ఖచ్చితంగా తిరగరాసే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 విడుదల సమయానికి నార్త్ నుంచి సౌత్ వరకు బడా హీరోల సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఇంత గట్టి పోటీలో పుష్ప ఎంతవరకు రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Also read: Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebooka

Trending News