Pushpa 2 Trailer event: పాట్నాలో ఆడియన్స్ మనసు దోచుకున్న బన్నీ.. స్టేజ్ పై ఏం చెప్పారంటే..?

Allu Arjun speech at Pushpa 2 event: తాజాగా అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప -2 సినిమాకు సంబంధించి, బీహార్ రాజధాని పాట్నాలో భారీ సెట్ వేసి ట్రైలర్ లాంచ్ చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే అక్కడ స్టేజ్ పై బన్నీ మాట్లాడుతూ బీహార్ అభిమానుల మనసు గెలుచుకున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 17, 2024, 08:01 PM IST
Pushpa 2 Trailer event: పాట్నాలో ఆడియన్స్ మనసు దోచుకున్న బన్నీ.. స్టేజ్ పై ఏం చెప్పారంటే..?

Allu Arjun speech: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప - 2. డిసెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం పుష్ప - 2 నుండి ట్రైలర్ ను  విడుదల చేశారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో ఈ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. 

ఇకపోతే స్టేజ్ పై ట్రైలర్ లాంచ్ తర్వాత బన్నీ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. ఎప్పుడు పాట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ ఇచ్చే ఘన స్వాగతానికి ధన్యవాదాలు. మీ ప్రేమంతా ఇక్కడ కనిపిస్తోంది. చాలా చాలా ధన్యవాదాలు. అందరూ ఎలా ఉన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా. ఇక నుండి వైల్డ్ ఫైర్.. నా హిందీ కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు దయచేసి నన్ను క్షమించగలరు..

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యంగా నా ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థాంక్యూ.. దేశం మొత్తానికి థాంక్యూ ఈ సినిమాని మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఇది నా గొప్పతనం కాదు మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. 

ఈ సందర్భంగా పుష్ప టీం కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. ముఖ్యంగా పుష్ప సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే స్పాన్సర్స్ కి, పోలీసు సిబ్బందికి, అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. 

డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థాంక్యూ బీహార్.. థాంక్యూ పాట్నా అంటూ అన్నారు. బన్నీ పాట్నాలోని బన్నీ అభిమానులు డైలాగ్ చెప్పమని అడగ్గా.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫ్లవర్ కాదు అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను సంతోషపరిచారు.

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News