Malli Pelli OTT: మళ్ళీ పెళ్లి మూవీకి షాక్.. స్ట్రీమింగ్ ఆపేసిన అమెజాన్ ప్రైమ్.. కారణం ఇదే..!

Amazon Prime Stops Malli Pelli Movie Streaming: మళ్ళీ పెళ్లి మూవీపై వీకే నరేష్ మూడో భార్య పోరాటం ఆపడం లేదు. నేటి నుంచి ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాగా.. స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. దీంతో అమెజాన్‌లో మళ్ళీ పెళ్లి సినిమా కనిపించడం లేదు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 23, 2023, 04:04 PM IST
Malli Pelli OTT: మళ్ళీ పెళ్లి మూవీకి షాక్.. స్ట్రీమింగ్ ఆపేసిన అమెజాన్ ప్రైమ్.. కారణం ఇదే..!

Amazon Prime Stops Malli Pelli Movie Streaming: సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న జంట వీకే నరేష్-పవిత్రా లోకేష్. వీరిద్దరు జంటగా నటించిన మూవీ మళ్ళీ పెళ్లి. వీరిద్దరు ప్రేమలో ఉండడం.. నరేష్ మూడో భార్య రమ్యా రఘపతి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి హంగామా సృష్టించడం మీడియాలో బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ ఎపిసోడ్‌ను మొత్తం మళ్ళీ పెళ్లి రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు నరేష్. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నా.. బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. మే 26న రిలీజ్ అయిన ఈ సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో బజ్ చూసి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మూవీ యూనిట్ భావించినా నిరాశే ఎదురైంది.

ఇక నేటి నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో మళ్ళీ పెళ్లి సినిమా స్టీమింగ్ అవుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్‌పై నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనను కించపరిచే విధంగా సినిమాలో సీన్లు ఉన్నాయని.. మూవీ స్ట్రీమింగ్‌ను ఆపేయాలని ఆమె నోటీసులు పంపించింది. ఈ సినిమా ద్వారా కావాలనే తన పరువును తీస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు అందుకున్న అమెజాన్ ప్రైమ్.. మళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ సినిమా కనిపించడం లేదు. ఆహాలో మాత్రం మళ్ళీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

నరేష్ తన కథనే సినిమాగా తీసినా.. విడుదలకు ముందు ఇది తన కథ కాదంటూ చెప్పుకొచ్చాడు. నరేష్ పెళ్లిళ్లు.. రమ్యా రఘుపతితో గొడవలు.. నరేష్ జీవితంలోకి పవిత్రా లోకేష్ ఎంట్రీ ఇవ్వడం.. ఆమె వ్యక్తిగత జీవితాలను తెరపై చూపించారు. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసినా.. ఆశించిన స్థాయిలో ఆడలేదనే చెప్పాలి. ఈ మూవీని నరేష్‌ స్వయంగా నిర్మించగా.. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. కీలక పాత్రల్లో శరత్ బాబు, జయసుధ, అనాన్య నాగళ్ల, వనితా విజయ్ కుమార్, మధు యాక్ట్ చేశారు. 

Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి   

Also Read: విండీస్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్‌పై వేటు.. శాంసన్, జైస్వాల్‌కు చోటు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News