Anasuya: కేటీఆర్ నిజమైన నాయకుడు.. అనసూయ పోస్ట్ వైరల్

Anasuya on KTR: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే నటి అనసూయ. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేటీఆర్ వేసిన పోస్ట్ కి స్పందించిన అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 10:00 AM IST
Anasuya: కేటీఆర్ నిజమైన నాయకుడు.. అనసూయ పోస్ట్ వైరల్

KTR: జబర్దస్త్ లో తన అందంతో మనల్ని మాయ చేసిన నటి అనసూయ. కాగా ఆ తర్వాత బుల్లితెర షోలకు ఎండ్ కార్డ్ వేసి సినిమాలోకి తెరంగేత్రం చేసింది. రంగస్థలంలో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే అనసూయ తన సినిమాలు షోలకన్నా కూడా ఎక్కువ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏదన్నా సరే ముక్కుసూటిగా సోషల్ మీడియాలో వేసేస్తూ చాలామంది దగ్గర విమర్శలకు గురి అవుతూ ఉంటుంది ఈ నటి.

కాగా ప్రస్తుతం అనసూయ టిఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తరువాత కేటీఆర్ గురించి వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

నిన్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పైన అత్యధిక ఓట్లతో గెలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల బీఆర్ఎస్‌ నాయ‌కులు కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ వేశారు. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం తాము ఆశించిన ఫ‌లితం రాలేద‌ని.. అయితే రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తన కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు కేటీఆర్. 

ఇక కేటీఆర్ ఎక్స్ లో పెట్టిన ఈ పోస్ట్ కు.. అనసూయ స్పందించింది. కేటీఆర్ ఓడిపోయి ఆ పోస్ట్ వేసిన అనసూయ మాత్రం ఆయనే నిజమైన నాయకుడు అంటూ మరో పోస్ట్ వేసింది. ‘మీరు నిజమైన నాయకుడు సార్.. మీరు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన తెలంగాణ రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. మీరు చేసిన అభివృద్ధి వ‌ల్ల నేను హైదరాబాద్ తో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డాను.. ధన్యవాదాలు.’ అంటూ అన‌సూయ ట్వీట్ చేసింది.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News