Anchor Lasya: సారీ చెప్పిన యాంకర్ రవి.. టామ్ అండ్ జెర్రీ మరోసారి..

Anchor Ravi Apologizes Anchor Lasya: బుల్లితెరపై యాంకర్లుగా చాలా మంది రాణించారు. యాంకర్ జోడీ అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం కచ్చితంగా యాంకర్ రవి, యాంకర్ లాస్య. యాంకరింగ్‌లో వీరు కొత్త కొత్త ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.

Last Updated : Jan 4, 2021, 04:20 PM IST
  • యాంకర్ జోడీ అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం కచ్చితంగా యాంకర్ రవి, లాస్య
  • కానీ ఈగో, ఈర్ష్య లాంటి కొన్ని తదితర కారణాలతో యాంకర్ జోడీ విడిపోయింది
  • అయితే 5ఏళ్ల తర్వాత టామ్ అండ్ జెర్రీ యాంకర్ రవి, లాస్య మళ్లీ ఒక్కటయ్యారు..
Anchor Lasya: సారీ చెప్పిన యాంకర్ రవి.. టామ్ అండ్ జెర్రీ మరోసారి..

Anchor Ravi Apologizes Anchor Lasya: బుల్లితెరపై యాంకర్లుగా చాలా మంది రాణించారు. యాంకర్ జోడీ అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం కచ్చితంగా యాంకర్ రవి, యాంకర్ లాస్య. యాంకరింగ్‌లో వీరు కొత్త కొత్త ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. వీరు యాంకరింగ్ చేసిన షోతో పాటు ఛానెల్ రేటింగ్స్ సైతం అమాంతం పెరిగిపోయాయంటే రవి, లాస్య యాంకరింగ్ జోడీ ఎంత పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొందరైతే వీరిని లవర్స్ అనుకున్నారు. అందుకే ఇంత క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ సరదాగా షో నడుపుతున్నారని టాక్ వినిపించేది. కొందరైతే వీరికి పెళ్లయిపోయిందని, భార్యాభర్తలన్నాక ఆ మాత్రం చనువు, సరదా, సెటైర్లు కూడా ఉంటాయని కితాబిచ్చేశారు మరీ. అయితే యాంకర్ రవి, యాంకర్ లాస్య(Anchor Lasya)ల మధ్య రిలేషన్‌కు బ్రేక్ పడింది. దాదాపు 5 సంవత్సరాలు వీరిద్దరూ కలుసుకోలేదు. ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో కూడా లేరు.

Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

 

 

తాజాగా రవి, లాస్య ఆర్ బ్యాక్ అంటూ యాంకర్ రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షో ప్రొమోకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. ఎలాంటి విషయంలోనైనా నిన్ను నేను ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించు అంటూ తన కో యాంకర్ లాస్యను కోరాడు రవి. ఆ వెంటనే ఇద్దరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టుకున్నారు. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అనే సంక్రాంతి షోను యాంకర్ రవి, లాస్య యాంకరింగ్‌తో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు కేవలం యాంకర్స్ మాత్రమే కాదు టాలీవుడ్(Tollywood) నటీనటులు కూడా.

Gallery: Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకునే యాంకర్ రవి, లాస్య జోడీ ఏకంగా 5 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకున్నారు. కలిసి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్ 4కు వెళ్లొచ్చిన లాస్య తనదైన ఫాలోయింగ్‌ను పెంచుకుందని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పాల్గొని సందడి చేశారు. 

Gallery: Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News