Anchor Suma Arrested: చేతికి సంకెళ్లతో సుమ.. అరెస్ట్ అయిందంటూ ప్రచారం! అసలేం అయిందంటే..?

Anchor Suma Photo With Handcuff: తెలుగు పాపులర్ యాంకర్  సుమ తాజాగా చేతికి సంకెళ్లతో కనిపించింది, ఆమె చేతికి సంకెళ్లు వేసి కారులో ఆమెను బంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 02:44 PM IST
Anchor Suma Arrested: చేతికి సంకెళ్లతో సుమ.. అరెస్ట్ అయిందంటూ ప్రచారం! అసలేం అయిందంటే..?

Anchor Suma Photo With Handcuffs Goes Viral: కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ అయినా తెలుగులో సుమా అంటే ఒక పాపులర్ యాంకర్, నటి, హోస్ట్ ఇలా రకరకాల పేర్లు ఆమె గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. సినిమా ప్రమోషన్స్ అనగానే కచ్చితంగా సుమ యాంకర్ గా ఆయా హీరోల ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటుంది సుమ. కేరళ అమ్మాయి అయినా సరే తెలుగు వారందరినీ మెప్పిస్తూ ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఆ మధ్య జయమ్మ పంచాయతీ అనే సినిమాతో నటిగా కూడా తనను తాను నిరూపించుకున్న సుమ తాజాగా చేతికి సంకెళ్లతో కనిపించింది. సుమ చేతికి సంకెళ్లు వేసి కారులో ఆమెను బంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత దూరమైనా వెళుతున్న మన సినిమా దర్శక నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె చేతికి సంకెళ్లు వేసి కారులో కూర్చోబెట్టారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Pooja Hegde Gown Photos: ఎల్లో కలర్ గౌనులో బుట్టబొమ్మలా పూజా హెగ్డే.. నెక్స్ట్ లెవల్ హాట్ ట్రీట్ చూశారా?

వాస్తవానికి సుమ చేతికి సంకెళ్లతో ఉన్న విధానాన్ని బట్టి పరిశీలిస్తే ఆమెను పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే నాగచైతన్య కస్టడీ అనే సినిమాతో తెలుగు సహా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా కోసం ఏమైనా సుమ ప్రమోషన్స్ చేస్తుందా? అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో నాగచైతన్య ఒక కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రూపొందుతోంది శ్రీ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చివరిగా వచ్చిన థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ఈ సినిమాతో హిట్టు అందుకుంటానని నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Meenakshii Chaudhary Pics: జాకెట్ లేకుండా శారీలో మెరిసిన మీనాక్షి చౌదరి..భలే మోసం చేసింది మావా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News