Telugu New Movies Downloads Through Telegram Links : టెలిగ్రామ్ గ్రూప్స్‌లో కొత్త సినిమాల డౌన్‌లోడ్ లింక్స్ వెదుక్కునే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ మోసగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. కొత్త సినిమాల లింక్స్ పేరిట మీ ఫోన్లలోకి కంటికి కనిపించని వైరస్‌ని చొప్పిస్తున్నారు. ఒక్కసారి మీ ఫోన్‌లోకి ఆ వైరస్ వెళ్లిదంటే.. మీ ఫోన్ ఆపరేటింగ్ అంతా ఇక వాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టే. మీ ఫోన్‌కి కనీసం ఓటిపి కూడా రాకుండానే వాళ్లే ఆ ఓటిపిని తీసుకుని మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మాయం చేసేస్తారు. ఒకవేళ మీ ఫోన్‌లో మీ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ హిస్టరీ డేటా ఏమైనా ఉన్నట్టయితే.. మీ క్రెడిట్ కార్డ్స్ కూడా గుల్లయినట్టే. మీ క్రెడిట్ కార్డ్స్‌ని కూడా ఆన్‌లైన్‌లోనే స్వైప్ చేసి అందులోని బ్యాలెన్స్‌ని నొక్కేస్తారు. మీకు తెలియకుండానే మీ ఎకౌంట్లో ఉన్న డబ్బు మాయం అవుతుంది. ఆ తరువాత కానీ మీకు అసలు విషయం బోధపడదు.
2022 లో అలా సైబర్ దాడులకు గురై 50 వేల మంది దాదాపు రూ. 95 కోట్లు మోసపోయారు. ఇది ఫిర్యాదుల రూపంలో బయటికొచ్చిన గణాంకాలు మాత్రమే. బయటికి రాని కేసులు ఇంకెన్నో ఉన్నాయి. పైరసీ సినిమాల కోసం కక్కుర్తి పడి డబ్బులు పోగొట్టుకున్నామంటే ఎవ్వరూ మెచ్చుకోరు సరికదా చీకొడతారు అనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. అన్నింటికి మించి పైరసీని ప్రోత్సహిస్తూ పైరసీ సినిమాలు వీక్షించడం కూడా నేరమే అవుతుంది కనుక పోయిన డబ్బులు ఎలాగూ తిరిగిరావు కాని కొత్త చిక్కుల్లో పడతాం అనే భయంతో ఇంకొంతమంది బయటికి రాలేకపోతున్నారు.
సినీ పరిశ్రమను పైరసీ దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇవాళ రేపు ఏ సినిమా విడుదలైనా.. 24 గంటల్లోపే పైరసీ అయి లీక్ అవుతున్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే సినిమా విడుదల కంటే ముందే పైరసీ కాపీలు బయటికొస్తున్నాయి. అది కూడా హెచ్‌డి ప్రింట్ సినిమాలు లీక్ అవుతూ బాక్సాఫీస్ అంచనాలను తారుమారు చేస్తున్నాయి. నిర్మాతలు ఖర్చుపెట్టిన కోట్ల రూపాయలు నష్టపోయేలా చేస్తున్నాయి. ఆ సినిమాను తెరకెక్కించడం కోసం దర్శకుడు సహా ఎంతోమంది సాంకేతిక నిపుణులు పడిన శ్రమ అంతా వృథా అవుతోంది.
పైరసీ కారణంగా నిర్మాతలు డబ్బులను నష్టపోతే.. దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ టాలెంట్ ని నష్టపోతున్నారు. ఒక సినిమా హిట్ అయితేనే వారికి మరో సినిమాలో అవకాశం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. అలాంటి పోటీ పరిశ్రమలో పైరసీ కారణంగా సినిమా ఫెయిలైతే.. ఆ సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. పైరసీ జోలికి వెళ్లకపోతే మిమ్మల్ని మీరు సైబర్ ఎటాక్స్ నుంచి కాపాడుకున్న వాళ్లు మాత్రమే కాదండోయ్.. పరోక్షంగా సినీరంగంపై ఆధారపడిన ఇంకెంతోమందికి బతుకునిచ్చిన వాళ్లు కూడా అవుతారు. అందుకైనా ఆలోచించండి.
ఇది కూడా చదవండి : Nandita Swetha Swimming Pics : స్విమ్మింగ్ పూల్‌లో నందితా శ్వేత.. తడి అందాలతో చలి పుట్టించేస్తోందిగా
ఇది కూడా చదవండి : Neha Desh Pandey Husband: ఏపీ మాజీ మంత్రి బంధువుతో డ్రగ్స్ వ్యాపారం.. టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్!
ఇది కూడా చదవండి : Vidya Balan in Saree: చీరకట్టులో విద్యాబాలన్ తరువాతే ఎవరైనా.. విద్యా బాలన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook