Jr NTR As Side Character : ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టరే.. వేణుస్వామి వీడియో వైరల్

Astrologer Venu Swamy on Jr NTR ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద గతంలో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 06:52 PM IST
  • ఆర్ఆర్ఆర్ పాత్రలపై మరోసారి రచ్చ
  • ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టర్ అంటూ కామెంట్లు
  • వేణుస్వామి పాత వీడియో తెరపైకి
Jr NTR As Side Character : ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టరే.. వేణుస్వామి వీడియో వైరల్

Jr NTR As Side Character ఆర్ఆర్ఆర్ సినిమా మీద, అందులో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు చేసిన పాత్రల మీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనే అంశంపై ఎప్పుడూ ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేరు. నందమూరి అభిమానులేమో ఎన్టీఆర్ నటనే హైలెట్ అని అంటారు. ఇక మెగా ఫ్యాన్స్ ఏమో రామ్ చరణ్‌ నటనే హైలెట్ అని అంటారు. ఇక సినిమా చూసిన నార్మల్ ఆడియెన్స్‌లో కొంత మంది రామ్ చరణ్‌ నటనకు ఫిదా అయితే.. ఇంకొంత మంది ఎన్టీఆర్ పర్ఫామెన్స్‌కు పడిపోయారు.

రామ్ చరణ్‌ పోషించిన పాత్రలో చాలా లేయర్స్, వేరియేషన్స్ ఉండటం, క్లైమాక్స్ మొత్తంలో రామ్ చరణ్‌ దూసుకుపోవడంతో కాస్త ఎన్టీఆర్ పాత్ర తక్కువైనట్టు అనిపిస్తుంది. కొమురం భీముడో పాటతో ఎన్టీఆర్ అందరినీ మెప్పిస్తాడు. అయితే క్లైమాక్స్ విషయంలో రామ్ చరణ్‌కు ఎక్కువగా మార్కులు పడ్డాయి. దీంతో కొంత మంది ఎన్టీఆర్‌ను సైడ్ కారెక్టర్ అని ట్రోల్ చేస్తుంటారు.

హాలీవుడ్‌లో ఓ రిపోర్టర్ ఇలానే ఎన్టీఆర్‌ను సైడ్ కారెక్టర్ అని అన్నాడట. ఇదే విషయాన్ని చిట్టిబాబు అనే నిర్మాత.. ఒక చానెల్‌లో డిబేట్లో పాల్గోని పదే పదే సైడ్ కారెక్టర్ అని అన్నాడంటూ నొక్కి మరీ చెప్పాడు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టర్.. ఇదిగో ఈ వేణు స్వామి ఎప్పుడో చెప్పాడంటూ పాత వీడియోను వదిలారు నెటిజన్లు.

 

ఇందులో ఆయన ఎన్టీఆర్ పాత్ర సైడ్ కారెక్టర్ అని అన్నాడు. సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్‌ పాత్రలా ఎన్టీఆర్ కారెక్టర్ ఉంటుందని, వెంకటేష్ రామ్ చరణ్‌ అయితే.. శ్రీకాంత్ ఎన్టీఆర్ అని పోల్చి మరి చెబుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read:  Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!

Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News