Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్యలో కొత్తగా కొలువు దీరిన భవ్య రామ మందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు చిరంజీవి,రామ్ చరణ్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Last Updated : Jan 23, 2024, 01:18 PM IST
Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya Ram Mandir - Chiranjeevi - Ram Charan: దేశ వ్యాప్తంగానే కాదు..ప్రపంచ వ్యాప్తంగా పేదా,గొప్ప,ఆడ,మగా తేడా లేకుండా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది. 5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఆలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా నిర్ణయించిన అభిజిత్ ముహూర్తంలోనే బాల రాముడు కొలువైనాడు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరడంతో రామ భక్తుల చిరకాల కోరిక నెవరేరింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామ భక్తులు ఎన్నో శతాబ్డాలుగా ఎదురు చూసారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు పలువరు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ రోజు చిరంజీవి, ఆయన సతీమణి, రామ్ చరణ్ తల్లిగారైన సురేఖతో పాటు రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ నుంచి అయోధ్యలో జరగిని  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. గతేడాది వాల్తేరు వీరయ్యతో పాటు హిట్ అందుకున్న మెగాస్టార్.. ఆ తర్వాత భోళా శంకర్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

రామ్ చరణ్ విషయానికొస్తే..ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత తన తండ్రి చిరుతో కలిసి చేసిన 'ఆచార్య'మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని ఈ యేడాది ద్వితీయార్దంలో దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఒక వైపు గేమ్ ఛేంజర్ మూవీ చేస్తూనే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో  విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయనున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో రామ్ చరణ్ జాయిన్ కానున్నారు.

Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News