Balakrishna: బాలకృష్ణతో కరణ్ జోహార్ అన్ స్టాపబుల్.. చిరు, నాగ్, వెంకీలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..!

Balakrishna Favorite Hero: ఆరు పదుల వయసు దాటినా కానీ.. ఇంకా కుర్ర హీరోల కన్నా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటారు బాలకృష్ణ. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్లు.. అందిస్తూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఐఫా నందమూరి హీరోని సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ  ఈవెంట్ లో కరణ్ జోహార్ తో.. రాపిడ్ ఫైర్.. రౌండ్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు.. మరింత ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు బాలయ్య.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 29, 2024, 06:07 PM IST
Balakrishna: బాలకృష్ణతో కరణ్ జోహార్ అన్ స్టాపబుల్.. చిరు, నాగ్, వెంకీలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..!

Balakrishna about Senior heroes :  హిందీలో కాఫీ విత్ కరన్ షో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఇంచుమించుగా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతూ.. తెలుగులో బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె వచ్చింది. అయితే ఈ షో మరింత విజయం సాధించింది. ఈ షో బాలకృష్ణలోని మరో యాంగిల్ ని సైతం చూపించింది.

కాగా ఈ మధ్యనే బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను మొన్న దుబాయిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలు.. నందమూరి బాలకృష్ణ అని సన్మానించారు. ఆయనకు లెగసి అవార్డు సైతం అందించారు. ఈ అవార్డుల వేదికలో.. కరణ్ జోహార్.. బాలకృష్ణతో రాపిడ్ ఫయర్ రౌండ్ ఆడారు. ఇందులో భాగంగా ఎన్నో ప్రశ్నలు అడిగారు. 

అయితే అన్ని ప్రశ్నలలో కన్నా.. కరణ్ అడిగిన ఒక ప్రశ్న.. అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి అంటే.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో మీకు ఎవరు ఫేవరెట్ హీరో అని అడిగారు. దానికి సమాధానంగా బాలకృష్ణ.. మీకు ఖాన్స్ లో ఎవరు ఇష్టం అని అడుగగా.. కరణ్ వెంటనే తాను ఈ స్థాయిలో ఉన్న దానికి కారణమైన షారుక్ అంతే తనకు ఇష్టమని చెప్పారు. ఇప్పుడు మీకు ఎవరు ఇష్టమో చెప్పండి అని కరణ్ మళ్ళీ అడగగా.. ముగ్గురు లెజెండ్స్ అని సమాధానమిచ్చారు బాలకృష్ణ. కాగా ఈ కార్యక్రమానికి.. చిరంజీవి, వెంకటేష్ సైతం అటెండ్ కావడం విశేషం. 

ప్రస్తుతం బాలయ్య చెప్పిన ఈ సమాధానం తెగ వైరల్ అవుతుంది. కాగా బాలకృష్ణ త్వరలోనే మరోసారి అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె షో తో రానున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బాబి దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు మోక్షాజ్ఞ సినిమా గురించి కూడా.. దగ్గర ఉంది మరీ బాలయ్య జాగ్రత్త తీసుకుంటున్నారని వినికిడి.

మరో పక్క చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. చిరంజీవి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లానింగ్ లో ఉండగా.. ప్రస్తుతం అది కుదిరేలా లేదని వినికిడి. మరోపక్క వెంకటేష్ తనకు ఎఫ్2 లాంటి మంచి విజయం అందించిన అనిల్ రావిపూడి తో మరో సినిమా చేస్తున్నారు.

 

Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News