Bandla Ganesh on Allu Bobby: తండ్రి మాట వింటే బాబీ అవుతారు, వినకుంటే బన్నీ అవుతారట!

Bandla Ganesh on Allu Venkatesh: అల్లు వెంకటేష్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 4, 2022, 07:25 PM IST
Bandla Ganesh on Allu Bobby: తండ్రి మాట వింటే బాబీ అవుతారు, వినకుంటే బన్నీ అవుతారట!

Bandla Ganesh interesting Comments on Allu Venkatesh: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయనకి నాలుగో కుమారుడు కూడా ఉన్నారు కానీ ఆయన యాక్సిడెంట్లో చిన్ననాడే చనిపోయారు.  అయితే ప్రస్తుతానికి పెద్ద కుమారుడు వెంకటేష్ కాగా రెండో కుమారుడు అల్లు అర్జున్, మూడవ కుమారుడు అల్లు శిరీష్.

అల్లు అర్జున్, శిరీష్ హీరోలుగా రాణిస్తుంటే బాబీ మాత్రం నిర్మాతగా నిలబడాలని చూస్తున్నారు. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బాబీ ఎందుకో గాని ముందు నుంచి సినిమాలకు దూరంగా ఉండేవాడు. కేవలం తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలు మాత్రమే ఆయన చూసుకుంటూ ఉండేవారు ఈ నేపథ్యంలో ఆయన పెద్దగా ఫోకస్ అవ్వలేదు.

అయితే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ద్వారా ఆయన నిర్మాతగా మారారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా అల్లు అరవింద్ కి మరో కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు బాబి అనే విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఒక ఈవెంట్లో బండ్ల గణేష్ అల్లు బాబీతో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కావాలని అన్నాడో లేక సరదాకి అన్నాడో తెలియదు కానీ అల్లు బాబి అంటే వెంకటేష్ తన తండ్రి అల్లు అరవింద్ మాట జవదాటడు అని అల్లు అరవింద్ ఏం చెబితే అది చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. అయితే బన్నీ మాత్రం తనకు నచ్చింది తాను చేసుకుంటూ వెళ్తాడని అలా అల్లు బాబీ ఇక్కడే ఉండిపోతే బన్నీ మాత్రం నేషనల్ లెవెల్ కి వెళ్లి పాన్ ఇండియా స్టార్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

కాబట్టి తండ్రి చెప్పిన మాటలు వింటే ఇలాగే బాబీలాగే ఇక్కడే ఉండిపోతారని అదే బన్నీలాగా మనకి నచ్చింది చేస్తే ముందుకెక్కడికో దూసుకుపోతారని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అల్లు అరవింద్ కి నలుగురు కుమారులు అందులో రాజేష్ అనే కుమారుడు ఎప్పుడో మరణించారని పలు సంధర్భాలలో వెల్లడైంది. 

Also Read: KV Anudeep : జాతి రత్నాలు అనుదీప్ చెప్పులు వేసుకోకపోవడం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?

Also Read: Chandramohan: 1000 సినిమాలు చేసి అలా 100 కోట్లు నష్టపోయిన చంద్రమోహన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News