Bigg Boss Telugu 4: నామినేషన్స్‌లో ఆరుగురు.. కానీ ఆ ఇద్దరు సేఫ్!

6 Contestants nominated for 8th week | బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. 8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ నామినేషన్‌లోకి వెళ్లారు. 

Last Updated : Oct 27, 2020, 08:18 AM IST
Bigg Boss Telugu 4: నామినేషన్స్‌లో ఆరుగురు.. కానీ ఆ ఇద్దరు సేఫ్!

స్ట్రాంగ్ కంటెస్టెంట్ దివి ఏడో వారం ఎలిమినేషన్ తర్వాత రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ ఇంట్లో ఏ మార్పులు లేవు. అయితే ఓటింగ్ విధానంపై బిగ్‌బాస్ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే తమకు వినోదాన్ని పంచుతున్న కారణంగా బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) చూస్తున్నట్లుగా వీక్షకులు చెబుతున్నారు. బిగ్‌బాస్ 4లో 51వ ఎపిసోడ్‌లో సోమవారం నాడు బిగ్‌ బాంబ్ ప్రభావంతో కిచెన్‌లో వంట చేస్తూ కనిపించింది. ఆమెకు అసిస్టెంట్ అయిన అభిజిత్ హాయిగా తింటూ కూర్చున్నాడు. మరో కంటెస్టెంట్ అఖిల్.. లాస్యకు సాయం చేస్తూ కనిపించాడు. ఈ వారం వంటలు ఏది చేసినా బిగ్‌బాస్ తెలుగు 4 ఇంటి సభ్యులు తినాల్సిందేనని, లేకపోతే వంటలు చేయడం కష్టమని లాస్య అంటోంది. ఆపై 8వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 

 

బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొత్తం 11 మంది సభ్యులుండగా, కెప్టెన్ అవినాష్‌ను నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ 4 ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సూచించారు. గత వారాలతో పోల్చితే ఈ వారం నామినేషన్లు వాడివేడిగానే జరిగాయి. మీ బిగ్‌బాస్ జర్నీలో ఇబ్బందులు కలగజేసిన వ్యక్తినిగానీ, లేక భవిష్యత్తులో సమస్య తలెత్తుతుందని భావించిన వ్యక్తిని నామినేట్ చేసి కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ సూచిస్తాడు. కారణాలు చెబుతూ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేశారు. లాస్య ఈ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 

 

కంటెస్టెంట్.. నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ 

  • లాస్య.. అమ్మ రాజశేఖర్, మొనాల్ గజ్జర్
  •  అఖిల్.. అరియానా, అమ్మ రాజశేఖర్.
  •  మెహబూబ్.. అరియానా, మొనాల్ గజ్జర్
  •  అవినాష్.. లాస్య, హారిక
  •  అమ్మ రాజశేఖర్.. అఖిల్, లాస్య
  •  అరియానా.. మెహబూబ్, అఖిల్
  •  సొహైల్.. అరియానా, అమ్మ రాజశేఖర్
  •  నోయల్.. మెహబూబ్, అఖిల్
  •  అభిజిత్.. మొనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్
  •  దేత్తడి హారిక.. అరియానా, మెహబూబ్
  •  మొనాల్ గజ్జర్.. మెహబూబ్, లాస్య

బిగ్‌బాస్ తెలుగు 4 ఎనిమిదవ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.... (6 Contestants nominated for 8th week)

8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ నామినేషన్‌లోకి వెళ్లారు. అయితే బిగ్‌బాస్‌కు కావలసిన కంటెంట్ ఇస్తున్న అఖిల్, మొనాల్‌లను మాత్రం ఎలిమినేట్ చేసే సాహసం బిగ్‌బిగ్ చేయడని వీక్షకులు భావిస్తున్నారు. మొనాల్ గజ్జర్ ఎలిమినేషన్‌లోకి వస్తున్న ప్రస్తున్న ప్రతిసారి ఓట్లు రాకున్నా ఆమె సేవ్ అవుతుందని ప్రచారం సైతం జరుగుతోందని తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News