HanuMan Free Tickets: ఒక టికెట్ కి ఇంకో టికెట్ ఫ్రీ.. హనుమాన్ బంపర్ ఆఫర్..

HanuMan One Plus One Offer: సంక్రాంతికి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలైన.. వాటన్నిటినీ వెనక్కి నెట్టి మరి సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది హనుమాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి ఒక టికెట్ కొంతే మరో టికెట్ ఫ్రీ ఆఫర్ ని అందజేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. అసలు ఎక్కడ ఈ ఆఫర్ అనే విషయం ఒకసారి చూద్దాం పదండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 05:45 PM IST
HanuMan Free Tickets: ఒక టికెట్ కి ఇంకో టికెట్ ఫ్రీ.. హనుమాన్ బంపర్ ఆఫర్..

HanuMan Free Ticket Code: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకుంది. జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ గా నడుస్తోంది. ఇక ఈ సినిమాకు మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. దాదాపు 150 కోట్లు దాటి ఏకంగా 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది ఈ చిత్రం.

ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమాకి ఒక టికెట్ కంటే మరొక టికెట్ ఫ్రీ అనే వార్త అందరినీ తెగ ఖుషి చేస్తోంది. మీరు విన్నది నిజమే మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయోధ్యలో నిర్మించిన రామ‌మందిరంలో (Ayodhya Ram Mandir) శ్రీరాముడు కొలువుదీరనున్న సంద‌ర్భంగా.. హ‌నుమాన్ సినిమాపై ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రేపు అనగా సోమవారం నాడు ఈ సినిమాకు ‘బై వన్‌.. గెట్‌ వన్ (ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘MIRAJBOGO’ అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫ‌ర్ ఒక్కరోజు మాత్రమే వర్తిస్తుంది. జనవరి 22న ఏ షోకి అయినా ఈ కోడ్ ఉపయోగించి ఒక టికెట్ కి మరో టికెట్ ఫ్రీగా పొందొచ్చు

 

మరోపక్క విడుదలకు ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ సినిమా యూనిట్ రామ మందిరానికి రెండున్నర కోట్ల విరాళం ఇచ్చింది.
ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు విరాళం ఇస్తామని హనుమాన్ మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా అయోధ్యకు భారీ విరాళం ఇచ్చింది హనుమాన్ మూవీ టీమ్.

హనుమాన్‌ సినిమాకి ఇప్పటివరకు 53,28,211 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వాటి నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు హనుమాన్ మూవీ నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పటికే హనుమాన్ ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్ల నుంచి రూ.14,85,810 చెక్కును అందజేశారు.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News