కేన్స్ ఫిలిం ఫెస్టివల్: అతిలోక సుందరికి హాలీవుడ్ ఘన నివాళి

బాలీవుడ్‌ లేడీ సూపర్ స్టార్‌‌కి ఘన నివాళి అర్పించనున్న కేన్స్ 

Last Updated : May 12, 2018, 11:51 PM IST
కేన్స్ ఫిలిం ఫెస్టివల్: అతిలోక సుందరికి హాలీవుడ్ ఘన నివాళి

బాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి స్వర్గీయ శ్రీదేవికి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ వేదికపై ఘన నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 16న శ్రీదేవి సంస్మరణార్థం ఏర్పాటుచేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆమె నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లోని దృశ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్‌లు అతిధులుగా హాజరవనున్నారు. బాలీవుడ్ మెచ్చిన నటి శ్రీదేవికి హాలీవుడ్ వేదికపై తగిన గౌరవం లభించనుండటంపై భోనీ కపూర్ హర్షం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలపాటు తన అభినయంతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న శ్రీదేవి ప్రతిభను గుర్తించి ప్రపంచ సినీ ప్రముఖుల సాక్షిగా కేన్స్ వేదికపై ఆమెను స్మరించుకోవడం శ్రీదేవికి తగిన గౌరవం అని బోనీ కపూర్ అన్నారు. 

ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా తమ మధ్య లేకపోవడం బాధ​కు గురిచేస్తున్నా.. ఆమె తన అద్భుత నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని బోనీ కపూర్ శ్రీదేవి సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.

Trending News