Hanu-Man Donation For Ram Mandir:
చైల్డ్ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోగా మారి.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ హీరో తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబి రెడ్డి అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న తేజ మళ్లీ అదే డైరెక్టర్ తో చేతులు కలిపి హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మొట్టమొదటి తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్.. ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా జనవరి 7న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇంద్ర సినిమాలో తన చిన్నప్పటి పాత్రలో కనిపించిన తేజ సజ్జ కోసం చిరంజీవి ఈ వేడుకకు హాజరయ్యారు. అందులో భాగంగా మాట్లాడుతూ తాను పెద్ద హనుమంతుని భక్తుడిని అని చెప్పిన చిరంజీవి అసలు ఎలా తన జీవితంలో హనుమంతుని మీద భక్తి మొదలైంది అని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వేడుకలో మాట్లాడుతూ చిత్ర బృందం తరపున చిరంజీవి ఒక ప్రకటన కూడా చేశారు. అయోధ్యలో రామ భక్తుల కోసం త్వరలో ద్వారాలు తెరవనున్న రామ మందిరానికి చిత్ర బృందం ఇవ్వనున్న విరాళం గురించి చెప్పుకొచ్చారు మెగా స్టార్.
"అయోధ్య లో రామ మందిర నిర్మాణం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవానికి నా కుటుంబం తో పాటు వెళ్తున్నాను. రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం నన్ను ఒక కీలక ప్రకటన చేయమని కోరారు" అని అన్నారు చిరంజీవి.
"తమ సినిమాకు వచ్చే వసూళ్లలో సినిమా ఆడినంత కాలం ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయించుకుంది" అని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అని చిత్ర బృందాన్ని అభినందించారు చిరంజీవి.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook