Senthil Kumar Wife Roohi No More: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాద వాతావరణం ఏర్పడింది. ఆమె మృతికి సినీ నటీనటులతోపాటు దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటిస్తున్నారు. సెంథిల్ కుమార్ 2009లో రుహీని వివాహం చేసుకున్నాడు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. సినీ పరిశ్రమతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టితో రుహీ కలిసి పని చేశారు కూడా.
సెంథిల్, రుహీకి ఇద్దరు కుమారులు. కరోనా వైరస్ బారినపడిన అనంతరం రుహీకి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటి నుంచి వైద్యం పొందుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి గురువారం విషమించింది. అవయవాలన్నీ పని చేయకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కొనసాగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.
Also Read: Tillu Square Trailer: టిల్లు అనే వాడు కారణజన్ముడు.. ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది?
కాగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లయినప్పటి నుంచి ఒకరిని విడిచి ఒకరు లేరు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్న జీవితంలో కరోనా రక్కసి రుహీని బలి తీసుకుంది. కరోనా ప్రభావిత లక్షణాలతో ఆమె అనారోగ్యానికి గురవడం కలచివేసింది. రుహీ కోలుకోవాలని సెంథిల్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అత్యాధునిక వైద్యం అందించే ప్రయత్నం చేసినా నిరాశే మిగిలింది.
తెలంగాణకు చెందిన కెకె సెంథిల్ కుమార్ భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. అమృతం సీరియల్‌కు తొలిసారి కెమెరా పట్టిన ఆయన అనంతరం 'అయితే' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనంతరం ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాలకు ఆస్థాన సినిమాటోగ్రఫర్‌గా ఉన్నారు. మగధీర నుంచి బాహుబలి (1, 2), ఈగ, ఆర్‌ఆర్‌ఆర్ వరకు సెంథిల్ డీఓపీగా కొనసాగారు. సై, ఛత్రపతి, అశోక్, యమదొంగ, త్రీ, అరుంధతి, తకిట తకిట, గోల్కొండ హైస్కూల్, రఫ్, విజేత సినిమాలకు సెంథిల్ పని చేశారు. అతడి సినిమాటోగ్రఫీకి ఎన్నో అవార్డులు వరించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook