Double Ismart 1st Week Box Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..

Double Ismart 1st Week Box Collections: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో  తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్  విలన్ పాత్రలో నటించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 22, 2024, 01:53 PM IST
Double Ismart 1st Week Box Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..

Double Ismart 1st Week Box Collections: పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో  రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ లీడ్ రోల్లో నటించిన సినిమా  ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం పూరీ, రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే.. అప్పట్లో ‘ఇస్మార్ట్ శంకర్’  సినిమా  రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల షేర్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా 5 యేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులను తిరస్కరించారు. అంతేకాదు ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను ఈ సినిమా మిస్ చేసుకుంది.

అంతేకాదు ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్ తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చినా.. నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ ఈ సినిమా మ్యాట్నీ నుంచే దారుణంగా పడిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

నైజాం (తెలంగాణ).. రూ. 3.89 కోట్ల షేర్  
సీడెడ్ (రాయలసీమ).. రూ. 1.42 కోట్లు షేర్
ఆంధ్ర ప్రదేశ్.. రూ.4.2 కోట్ల షేర్
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.51 కోట్లు షేర్ (రూ. 14.80 కోట్ల గ్రాస్)
హిందీ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి.. రూ. 0.98 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 0.78 కోట్లు
మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.27 కోట్ల షేర్ (18.60 కోట్ల గ్రాస్)

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం రూ. 37.73 కోట్ల షేర్ రాబట్టాలి. ఇపుడుతున్న పరిస్థితుల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోలుకోవడం కష్టమే. మొత్తంగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తంగా రామ్ తో పూరీ జగన్నాథ్.. డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ కాకుండా.. తన సినిమానే రీమేక్ చేసాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ప్రేక్షకులను తక్కువ అంచనా వేసిన పూరీ జగన్నాథ్ కు ఆడియన్స్ కర్రు కాల్చి వాత  పెట్టారనే చెప్పాలి. ఏది ఏమైనా.. ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ హంగామా చేసిన పూరీ జగన్నాథ్, రామ్ కెరీర్ లో ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి.  మొత్తంగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తెరకెక్కించిన  ఈ సినిమా మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News