Gopichand Malineni Son : కొడుకు కోసం గోపీచంద్ మలినేని తాపత్రయం?.. వీర సింహా రెడ్డికి కలిసి రాని సెంటిమెంట్‌

Gopichand Malineni Son గోపీచంద్ మలినేని తీసిన వీర సింహా రెడ్డి సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. రొటీన్ కథే అయినా కూడా మేకింగ్ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడంతే జనాలు పెదవి విరుస్తున్నారు. ఊహకందేలా సాగే కథనంతో చాలా చప్పగా సాగిందనే ఫీలింగ్‌లో ఆడియెన్స్ ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2023, 01:25 PM IST
  • బాలయ్య వీర సింహా రెడ్డికి మిక్స్డ్ టాక్
  • కొడుకు కోసమే పాత్రను పెట్టాడా?
  • వర్కౌట్ కాని గోపీచంద్ మలినేని సెంటిమెంట్
Gopichand Malineni Son : కొడుకు కోసం గోపీచంద్ మలినేని తాపత్రయం?.. వీర సింహా రెడ్డికి కలిసి రాని సెంటిమెంట్‌

Gopichand Malineni Son గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమాలు దాదాపు మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తుంటాయి. బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక క్రాక్ సినిమాతో అయితే తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చాడు గోపీచంద్ మలినేని. తన కొడుకు కోసమే అన్నట్టుగా క్రాక్‌లో కొన్ని సీన్లు కూడా పెట్టేసుకున్నాడు. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలా తన కొడుకు సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అయింది. అదే సెంటిమెంట్‌ను వీర సింహా రెడ్డిలో రిపీట్ చేయాలని భావించినట్టున్నాడు గోపీచంద్.

కానీ వీర సింహా రెడ్డి సినిమాతో తన కొడుకు కోసం రాసుకున్న సీన్లు కాస్త ఓవర్‌గా అనిపించాయి. ఆ కుర్రాడినే హైలెట్ అయ్యేలా చేశాయి. ఆ రెండు మూడు నిమిషాలు ఆ కుర్రాడి డైలాగ్స్, ఆ స్క్రీన్ స్పేస్‌ కూడా ఓవర్‌గానే అనిపించింది. తన కొడుకు కోసం కావాలనే గోపీచంద్ మలినేని ఆ సీన్లు డిజైన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది.

పక్క ఊర్లో జరిగే ఘోరాలు వీర సింహా రెడ్డికి తెలియాలనే ఒకే ఒక్క కారణంతో ఆ సీన్లన్నీ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కుర్రాడే ఆ ఊరి భవిష్యత్తుని మార్చాడన్నట్టుగా చూపించాడు. ఇక ఫైటింగ్ సీక్వెన్స్‌లోనూ ఆ బుడ్డోడిని పెట్టేసుకున్నారు. గంగిరెడ్డికి వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా బుడ్డోడితోనే చేయించాడు. ఇలా తన కొడుకు కోసం బాగానే సీన్లు రాసుకున్నాడు గోపీచంద్.

అయితే ఈ సినిమాకు ఇప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. తన కొడుకు సెంటిమెంట్ ఈ సినిమాకు అంతగా కలిసి వచ్చినట్టు అనిపించడం లేదు. మరి నెక్ట్స్ మూవీలో తన కొడుకు కోసం గోపీచంద్ ఎలాంటి పాత్రను రాస్తాడో.. ఎలాంటి యాక్షన్ చేయిస్తాడో చూడాలి.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News