Hrithik Roshan: బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె హీరో హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు సినిమా యూనిట్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ , సెకండ్ సాంగ్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'హీర్ ఆస్మాని' సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట కూడా అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె డాన్స్ మూమెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook