Jani Master Case: జానీ మాస్టర్ వ్యవహారం.. పుష్ప నిర్మాత షాకింగ్ కామెంట్..!

Pushpa 2 Producer About Jani Master Case: జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో 14 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేయడం వల్ల ఆయన ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ వార్తలు రాగా పుష్ప నిర్మాత దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 23, 2024, 03:51 PM IST
Jani Master Case: జానీ మాస్టర్ వ్యవహారం.. పుష్ప నిర్మాత షాకింగ్ కామెంట్..!

Allu Arjun - Jani Master: గత కొద్ది రోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రకరకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా మహిళా కొరియోగ్రాఫర్ పై ఈయన ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళా కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి చేస్తున్నట్టు బాధిత యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

దీంతో పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు అవ్వడమే కాకుండా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గానూ జానీ మాస్టర్ పై పలు సెక్షన్  కింద కేసు కూడా వేశారు. ప్రస్తుతం చంచల్గూడా  జైల్లో రెండు వారాల పాటు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. 

అయితే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ కూడా ఇప్పుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ కి, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం ఇది. పుష్ప 2  సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్ గా ఆమెతో మేము పనిచేయించుకున్నాము. అలాగే జానీ మాస్టర్ తో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేయించుకోవాల్సి ఉంది. కానీ నీలోపే ఇలా మొత్తం జరిగిపోయింది. నిజానికి ఈ విషయంలో అల్లు అర్జున్ కి  ఎటువంటి సంబంధం లేదు అంటూ రవిశంకర్ వెల్లడించారు. 

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ పై ఫైర్ అవుతూ.. అల్లు అర్జున్ బాధిత యువతికి అండగా నిలిచారని, ఆ అమ్మాయికి తన సినిమాలో అవకాశం కల్పిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు జానీ మాస్టర్ పుష్ప  సినిమా షూటింగ్ సెట్లో బాధిత యువతిపై దాడి చేయడం దగ్గరుండి అల్లు అర్జున్ , సుకుమార్ చూసినట్లుగా కూడా కథనాలు సృష్టించారు.

దీనిపై రవిశంకర్ స్పందిస్తూ.. అసలు ఈ విషయానికి, అల్లు అర్జున్ కి  అసలు సంబంధం లేదని, అల్లు అర్జున్ కు ఈ విషయం తెలియనే లేదు అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ లను ఇన్వాల్వ్ చేసి వారి ఇమేజ్ ను  డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Also Read: NTR Emotional: పోలీస్‌ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్‌ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తా

Also Read: Devara Pre Release: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. దేవర ప్రి రిలీజ్‌ వేడుక రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News