Kalaavathi Song Making Video: మహేశ్‌ బాబుపై.. కీర్తి సురేష్‌ పంచ్ ఎలా విసిరిందో చూశారా!

Kalaavathi Making Video: సర్కారు వారి పాట సినిమా నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది.. అయితే ఇప్పుడు ఆ పాట మేకింగ్‌ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 02:59 PM IST
  • సర్కారు వారి పాట నుంచి వచ్చిన కళావతి సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌
  • యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోన్న సాంగ్
  • సోషల్ మీడియాలో మేకింగ్ వీడియో వైరల్
  • సెట్స్‌లో సరదా సరదాగా గడిపిన మహేశ్ బాబు, కీర్తి సురేష్‌, తమన్
Kalaavathi Song Making Video: మహేశ్‌ బాబుపై.. కీర్తి సురేష్‌ పంచ్ ఎలా విసిరిందో చూశారా!

 Sarkaru Vaari Paata Kalaavathi Song: మహేశ్ బాబు.. కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన మూవీ.. సర్కారు వారి పాట. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ పాట విడుదల అయింది. కళావతి సాంగ్‌కు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. సిద్‌ శ్రీరామ్‌ ఈ పాట పాడారు.

మాంగళ్యం తంతునానేనా.. వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో... కమా కమాన్‌ కళాతి అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సెట్స్‌లో డైరెక్టర్ పరశురామ్‌.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సందడి చేశారు. కళావతి సాంగ్‌ కోసం శేఖర్ మాస్టర్ సింపుల్స్‌ స్టెప్స్‌ డిజైన్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తుంటే.. కళావతి సాంగ్‌ మేకింగ్‌ చాలా సరదాసరదాగా సాగిందని తెలుస్తోంది. సెట్స్‌లో మహేశ్ బాబు.. కీర్తి సురేష్‌, తమన్ సరదా సరదాగా గడిపారు.

కీర్తి సురేష్‌ బుజ్జి కుక్క పిల్లను ముద్దాడడం.. మహేశ్‌ బాబుకు శేఖర్ మాస్టర్‌‌ డ్యాన్స్‌ స్టెప్స్‌ చూపించడం.. కీర్తి సురేష్‌ మహేశ్‌ బాబు కడుపుపై పంచ్‌ విసరడం.. ఇలాంటి సీన్స్‌ చాలానే ఉన్నాయి ఈ మేకింగ్‌ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరూ ఓ లుక్కేయండి.

 
 
 
 
 

 

సర్కారు వారి పాట సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించాయి. ఈ సినిమా మే 12న రిలీజ్‌ కానుంది.

Also Read: Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!

Also Read: Mallareddy on CM KCR: కేసీఆర్ ప్రధాని కావాలని మేడారంలో మంత్రి మల్లారెడ్డి మొక్కు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News