Kalki 2898 AD: భారీగా పెరిగిన కల్కి సినిమా రేట్లు.. ఒక్క టికెట్ రేట్ ఎంతో తెలుసా..

Kalki Tickets: భారీ అంచనాల మధ్య ప్రభాస కల్కి.. సినిమా ఈ గురువారం విడుదల కాబోతోంది. సినిమా మీద అంచనాలతో పాటు ..సినిమా టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు మల్టీప్లెక్స్ లలో ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా టికెట్ రేట్లు.. భారీగానే పెరిగాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 24, 2024, 01:18 PM IST
Kalki 2898 AD: భారీగా పెరిగిన కల్కి సినిమా రేట్లు.. ఒక్క టికెట్ రేట్ ఎంతో తెలుసా..

Kalki Tickets Price: ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాక.. మిగతా భాషల నుంచి కూడా ప్రభాస్ అభిమానులు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై.. బజ్ తారాస్థాయిలో ఉంది. 

ఇక సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రికార్డు స్థాయిలోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ అవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అయితే ఈ సినిమా టికెట్ రేట్ ల పెంపు కోసం దర్శక నిర్మాతలు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే.

కల్కి సినిమా ఒక్కో టికెట్ మీద సింగిల్ స్క్రీన్ వారు 75 రూపాయలు, మల్టీప్లెక్స్ వారు 100 రూపాయలు అదనంగా చార్జ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కల్కి ఒక టికెట్ ధర మల్టీప్లెక్స్ లో 413 రూపాయలు కాగా, సింగిల్ స్క్రీన్ లో 265 రూపాయలు. రెండు రాష్ట్రాలలో కూడా ఈ భారీ ధరలు అమలు చేస్తున్నారు. ఇక సినిమా త్రీడీలో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 

త్రీడీలో టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. త్రీడీ సినిమా టికెట్ మల్టీప్లెక్స్ అయితే 495 రూపాయలు సింగిల్ స్క్రీన్ లో 377 రూపాయలు. కాగా టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి కాబట్టి.. ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు. 

దీపికా పడుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంతోష్ నారాయణన్.. ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన.. రెండు ట్రైలర్లు సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో ప్రభాస్ ను చూడడానికి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. మరోవైపు అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ని చూడడానికి అయినా అభిమానులు కచ్చితంగా సినిమాని థియేటర్లో చూడటానికే ఇష్టపడతారు.

Also read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News