Kapunadu Leaders Strong Warning to Ram Gopal varma: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అవ్వడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వీరిద్దరి భేటీ మీద రకరకాల స్పందనలు బయటకు వస్తున్నాయి, వారందరిదీ ఒక ఎత్తు అయితే వివాదాస్పద సినిమా దర్శకుడుగా పేరున్న రాంగోపాల్ వర్మ కాపులందరికీ పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం మరో ఎత్తు.
ఆయన అలా ట్వీట్ చేయడంతో ఆయన మీద కాపునాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాంగోపాల్ వర్మ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాంగోపాల్ వర్మ, నీ ప్యాకేజీల కోసం కాపుల మీద కామెంట్ చేస్తే చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరించారు. కాపులను రాజకీయ కారణాలు పేరుతో విభజించాలనే కుట్ర జరుగుతోందని, విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు వర్మ లాంటి ఊర కుక్కలు వదులుతున్నారని కాపునాడు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో జగన్ కాపుల కోసం అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని కాపు జాతి గురించి ప్రేమ ఉంటే జగన్ నిలదీయమని వర్మను వారు కోరారు. ఇక వైసీపీలో ఉన్న కాపు నేతలు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాపు జాతి గురించి మాట్లాడేవారు కాపులకు ఏమైనా చేశారా? అని కాపునాడు నేతలు ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మకు సిగ్గు శరం అనేవి ఏమాత్రం లేవని పేర్కొన్న కాపు నేతలు, జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు వాగుతున్నాడని అన్నారు.
ఇక వర్మ నోరు అదుపులో పెట్టుకో, కాపు జాతిని అవమానించడం దుర్మార్గం అంటూ వారు రాంగోపాల్ వర్మకి వార్నింగ్ ఇచ్చారు. గతంలో వంగవీటి మోహన్ రంగా మీద సినిమాలు తీసి డబ్బులు దండుకున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటే నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అంటూ వారు హెచ్చరించారు. నువ్వు రాసిన పోస్టులు వెనక్కి తీసుకుని కాపు జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు, అంతేకాక కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులు పెట్టే రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే వర్మ వీరి డిమాండ్లకు ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Shruthi Hassan: 'వాల్తేరు వీరయ్య'కి జ్వరమంటూ హ్యాండిచ్చి బాలయ్య షోకి శ్రుతి హాసన్?
Also Read: Actress Sudha: ‘వందల కోట్లు పోయి ఒంటరయ్యా.. నా వాళ్ళు నన్ను వదిలేశారన్న నటి సుధ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook