తెలంగాణ పోలీస్‌కు.. "ఖాకీ" సినిమా ప్రత్యేకం

తెలంగాణలో పోలీసు కమీషనరును కలిసి ఈ శని, ఆదివారాల్లో 1500 మంది రాష్ట్ర పోలీసులకు ఉచిత షో వేసి ఈ చిత్రాన్ని చూపించాలని భావిస్తున్నట్లు తెలిపారు

Last Updated : Nov 26, 2017, 06:26 PM IST
తెలంగాణ పోలీస్‌కు.. "ఖాకీ" సినిమా ప్రత్యేకం

కర్త్యవం, పోలీస్ స్టోరీ, అంకుశం లాంటి సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులను సిసలైన హీరోలుగా చూపించిన మేటి సినిమాలు. ఇప్పుడు వాటి సరసన తమిళ డబ్బింగ్ చిత్రం "ఖాకీ" కూడా చేరనుంది. తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలే తెలుగులో కూడా విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. నిజాయతీ గల పోలీసుగా, బందిపోటు ముఠా రహస్యాన్ని  చేధించే క్రమంలో అగచాట్లు పడ్డ అధికారిగా వాస్తవికమైన నటనతో ఆకట్టుకున్న కార్తి పలువురి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పోలీసులకు అంకితమిచ్చారు. తెలంగాణలో పోలీసు కమీషనరును కలిసి ఈ శని, ఆదివారాల్లో 1500 మంది రాష్ట్ర పోలీసులకు ఉచిత షో వేసి ఈ చిత్రాన్ని చూపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే  డీజీపీ జాంగిద్ ప్రశంసలతో ముంచెత్తారు. 

Trending News