Meter Pre Release Event : కలిసి చర్చించుకునే వాళ్లం.. నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Meter కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన సమయంలో జరిగిన వాటిని గుర్తు చేసుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 03:07 PM IST
  • గ్రాండ్‌గా మీటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న కిరణ్‌ అబ్బవరం
  • కుమార్ కాసారంపై కిరణ్ ప్రశంసలు
Meter Pre Release Event : కలిసి చర్చించుకునే వాళ్లం.. నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Meter: టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఇప్పుడు ఎన్నో రకాల ఫ్లాట్‌ఫాంలున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్‌ అంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌లు చేసుకుంటూ ఎంతో మంది సిల్వర్ స్క్రీన్‌ మీద వెలిగిపోతోన్నారు. షార్ట్ ఫిల్మ్స్‌ చేసుకుంటూ సిల్వర్ స్క్రీన్‌ మీద ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులిగా మారారు. అలా వచ్చిన కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు హీరోగా దూసుకుపోతోన్నాడు. తాజాగా తన పాత రోజుల్ని, పాత స్నేహితుడు కుమార్‌ను గుర్తు చేసుకున్నాడు. మీటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాటి రోజుల్ని తలుచుకున్నాడు కిరణ్ అబ్బవరం. 

కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కమర్షియల్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాతో రాబోతోన్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తన యూట్యూబ్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సమయంలో తనకు యువ నటుడు కుమార్‌ కాసారం గురించి చెప్పుకొచ్చాడు.

కుమార్ గురించి మాట్లాడుతూ.. తాము షార్ట్ ఫిల్మ్స్ చేసే సమయంలో ఇద్దరం క్లోజ్‌గా ఉండే వాళ్లమని, ఒకరి షార్ట్ ఫిల్మ్స్ గురించి ఇంకొకరు మాట్లాడుకునే వాళ్లమని, చర్చించుకునే వాళ్లమని అన్నాడు. అలాంటి కుమార్‌తో ఇప్పుడు కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, మీటర్‌లో మంచి పాత్రను పోషించాడని చెప్పుకొచ్చాడు.

Also Read:  Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్

ఇక కుమార్ సినీ ప్రయాణం కూడా ఎంతో విశేషంగా ఉంది. మజిలీ, ఓ బేబీ, సర్ వంటి సినిమాల్లో మంచి రోల్స్ పోషించాడు. ఇక ఇప్పుడు పెద్ద బ్యానర్‌లో హీరోగా సినిమాను పూర్తి చేశాడు. మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు. చూస్తుంటే మరో యంగ్ హీరోని యూట్యూబ్ అందించినట్టే కనిపిస్తోంది.

Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News