Mahesh Babu, Trivikram combo: మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా ?

మహేష్ బాబుకు ( Mahesh Babu ) మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్‌కు ( Trivikram Srinivas ) మధ్య దూరం పెరిగిందా అనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య ఏమైనా దూరం పెరిగిందా అనే టాక్ మొదలైంది.

Last Updated : Sep 12, 2020, 12:50 AM IST
Mahesh Babu, Trivikram combo: మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా ?

మహేష్ బాబుకు ( Mahesh Babu ) మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్‌కు ( Trivikram Srinivas ) మధ్య దూరం పెరిగిందా అనే టాక్ వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ఎంత హిలేరియస్ కామెడీని పంచాయో అందరికీ తెలిసిందే. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే ఆ ఇద్దరి కాంబోలో సినిమాలపై అభిమానులకు, ఆడియెన్స్‌కి ఉండే ఆసక్తి ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. Also read : Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి త్రివిక్రమ్ సినిమా చేయొచ్చనే టాక్ ( Trivikram to direct Mahesh Babu ) గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకుండా చాలా సమయం లభించడంతో ఈ గ్యాప్‌లో మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టును సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో సూపర్ స్టార్‌తో మహేష్ బాబు సినిమా చేయడానికి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చనే టాక్ వినిపించింది. Also read : Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

ఇదిలావుంటే, తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే... మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా ( Sarkaru vaari paata ) పూర్తయిన తర్వాత రాజమౌళితో సినిమా ( SS Rajamouli to direct Mahesh Babu ) చేయడానికంటే ముందుగా మరో దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని. అంటే రాజమౌళితో సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్‌తో మహేష్ బాబు సినిమా చేసే అవకాశాల్లేవన్న మాట. త్రివిక్రమ్‌తో సినిమాకు మహేష్ బాబు ఆసక్తి చూపించడం లేదని.. అందుకే మరో దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నారనేది ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య ఏమైనా దూరం పెరిగిందా అనే టాక్ మొదలైంది. ఆ ఇద్దరి మనసుల్లో ఏముందో లేదో తెలియదు కానీ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం మాత్రం సోషల్ మీడియాలోకి సైతం పాకింది.  Also read : Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?

Trending News