Meetha Raghunath Marraige: సడెన్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్..

Meetha Raghunath Marraige: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్‌ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ కోవలో మరో క్రేజీ హీరోయిన్ మీతా రఘునాథ్ రహస్యంగా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌ను బిత్తరపోయేలా చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2024, 11:33 AM IST
Meetha Raghunath Marraige: సడెన్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్..

Meetha Raghunath Marraige: కథానాయికలు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెడుతున్నారు. ఈ కోవలో మరో యంగ్ బ్యూటీ మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. అది కూడా కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయితో వివాహా బంధంలో అడుగుపెట్టింది క్రేజీ హీరోయిన్ మీతా రఘునాథ్. తమిళంలో విడుదలైన 'గుడ్ నైట్' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. అంతకు ముందు ఈమె  'ముదల్ ముదవమ్ నీ' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చేసింది రెండు సినిమాలే అయినా.. ఆయా సినిమాల్లో తన యాక్టింగ్‌తో మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాల్లో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. ఆ మధ్య నిశ్చితార్ధం చేసుకొంది. హీరోయిన్‌గా ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ఈ భామ.. సడెన్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు. అదే కోవలో ఈమె కూడా కథానాయికగా కెరీర్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

మీతా రఘునాథ్ తన సొంత ఊరైన ఊటీలో పెళ్లి చేసుకుంది. ఎపుడు జరిగిందనేది విషయాలను మాత్రం వెల్లడించలేదు. కానీ తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు తమ హీరోయిన్‌కు పెళ్లి చేసుకుందని బాధ పడుతుంటే..ఈమె కో ఆర్టిస్టులు మాత్రం.. కొత్తగా పెళ్లైన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



View this post on Instagram


A post shared by Meetha Raghunath (@the.meethling)

ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు పెళ్లి కొడుకు ఎవరనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x