Megastar Chiranjeevi: హనుమాన్ దర్శకుడుతో సినిమా వదులుకున్న చిరంజీవి.. అదే కారణం!

Prasanth Varma: స్టార్ హీరోల సినిమాతో పోటీపడి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హనుమాన్. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పైన పడింది. అయితే హనుమాన్ సినిమా కన్నా ముందే ప్రశాంత్ వర్మ చిరంజీవితో ఒక చిత్రం చేయాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయ్యిందట..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 10:19 PM IST
Megastar Chiranjeevi: హనుమాన్ దర్శకుడుతో సినిమా వదులుకున్న చిరంజీవి.. అదే కారణం!

HanuMan: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా పరంగా గట్టిగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. నిన్న మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో యవరేజ్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ సినిమాని తెరకెక్కించి స్టార్ హీరోల సినిమాను సైతం వెనక్కి నెట్టాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

హనుమాన్ సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహకారం అందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చి సినిమా రిలీజ్ కి మరింత క్రేజ్ ని తీసుకు వచ్చారు. తాజాగా అలాంటి చిరంజీవి ప్రశాంత్ వర్మ సినిమా చేయలేకపోయారు అనే వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

అసలు విషయానికి వస్తే హనుమాన్ సినిమా చూసి మెగా అభిమానులు అందరూ ప్రశాంత్ వర్మాన్ని చిరంజీవితో ఒక చిత్రం చేయమని కోరుతున్నారు. ఇదే విషయంపై ఈమధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో తన మొదటి సినిమా కూడా మొదలు పెట్టక ముందే.. ప్రశాంత్ వర్మ, చిరంజీవికి ఓ కథ వినిపించారట. చిరంజీవిని ఓ సందర్భంలో కలుసుకున్న ప్రశాంత్ వర్మ.. ఏదో సరదాకి ఓ సినిమా స్టోరీ చెప్పారట. అది చిరంజీవికి కూడా చాలా నచ్చేసిందట. ఆ తరువాత మళ్ళీ చిరుని ఒకసారి కలుసుకొని ఈసారి పూర్తి నరేషన్ ఇచ్చారట. ఆ కథలో చిరు కొన్ని చేంజెస్ చెప్పారట. ఆ మార్పులు అన్నీ కూడా మళ్లీ ప్రశాంత్ వర్మ చేసుకొని వచ్చి చిరంజీవికి కథ చెప్పారట. వెంటనే చిరంజీవి ఓకే అన్నారట. కానీ ఈ చిత్రం మొదలు పెడతాం అనేకునే సమయంలో చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ చర్చలు జరుగుతున్నాయి. 

ఈ సినిమా ఓకే అయ్యినప్పుడే సైరా పట్టాలు ఎక్కిందట. అందుకే మన మెగాస్టార్ సైరా సినిమాలో బిజీ అవ్వడంతో.. ప్రశాంత్ వర్మ ‘ఆ’ సినిమా చేశారు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అయ్యారు. ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మెగా అభిమానులు చిరంజీవి సైరా బదులు ప్రశాంత్ వర్మ సినిమా ఒప్పుకొని ఉంటే బాగున్ను అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News