Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వక క్షమాపణలు.. ఏమన్నారంటే?

Mohan Babu Letter: మంచు రచ్చకు ఎండ్‌ కార్డు పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు చెప్పారు. టీవీ9 మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.

Written by - Renuka Godugu | Last Updated : Dec 13, 2024, 09:18 AM IST
Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వక క్షమాపణలు.. ఏమన్నారంటే?

Mohan Babu Letter: మంచువారింట గత మూడు నాలుగు రోజులుగా రచ్చ రగిలిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఓ శుభం కార్డు కూడా పడింది... అయితే మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై దాడి చేయడంతో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు రెండు రాష్ట్రాల జర్నలిస్ట్ సంఘాలు ఆవేదనకు దిగాయి. దీంతో దిగివచ్చిన పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

Add Zee News as a Preferred Source

మంచు మనోజ్ శంషాబాద్ లో ఉన్న జలపల్లి లో ఫామ్ హౌస్ కి వెళ్ళగా అక్కడ లోపానికి అనుమతించలేదు. దీంతో గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు.. ఆ సందర్భంలో జర్నలిస్టులు కూడా అక్కడే కవరేజ్ కి వెళ్లారు. అయితే మోహన్ బాబు వారిపై ఒకసారి క విరుచుకుపడ్డాడు. మైకు లాక్కొని అయ్యప్ప మాలలో ఉన్న టీవీ9 రిపోర్టర్ పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టర్ కి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆ తర్వాత వెంటనే బీపీ స్థాయిలు ఎక్కువయ్యాయని మోహన్ బాబుని కూడా ఆసుపత్రికి తరలించారు.

ఆయన కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఇంటర్నల్ గా కూడా ఏవో గాయాలు అయ్యాయని మెడికల్ రిపోర్ట్ ను కూడా కాంటినెంట్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్ను కోలుకున్నారు. రిపోర్టర్‌పై దాటికి సంబంధించి క్షమాపణలు చెబుతున్నట్లు ఓ లెట్టర్ విడుదల చేశారు. అందులో ఆయన ఏం రాశారంటే..?

'నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. తీవ్ర ఆందోళన కారణంగా నేను టీవీ9 జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను. ఆ తర్వాత నా ఆరోగ్యం బాగోలేని కారణంగా వెంటనే స్పందించ లేకపోయాను... 48 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. అందుకే ఆవేశంలో జరిగిన ఘటనాలో జర్నలిస్టుకు గాయం అవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి, టీవీ9 కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని మోహన్ బాబు పేర్కొన్నారు.

 

 

 

ఇదీ చదవండి:  బాబోయ్‌.. ఇదేం చలి? భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, తీవ్ర ఇబ్బందులు..  

ఇది ఇలా ఉండగా మొన్న మంచి మనోజ్ మీడియాతో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం అందరు విషయాలు చెప్తాను అని ప్రెస్ మీట్ పెడతాను అన్న వ్యక్తి కూడా సడెన్‌గా క్యాన్సిల్ చేశారు. రాచకొండ సీపీ కూడా మంచు విష్ణుని పిలిచి  ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే... అంతకుముందు వీరి వద్ద నుంచి గన్స్ కూడా సరెండర్ చేసుకున్నారు. బౌన్సర్లను కూడా బైండోవర్ చేయమని ఆదేశించారు.

అయితే మోహన్ బాబు ఇలా రిపోర్టర్ పై దాడి చేయడంతో రెండు రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి... అంతేకాదు ఫిలిం చాంబర్ వద్ద కూడా ధర్నాకు దిగాయి.
ఈనేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు కూడా తీవ్ర విమర్శలకు గుప్పించారు.. అంతేకాదు మోహన్ బాబు మానసిక పరిస్థితి బాగోలేదని ఆలోచన కూడా గురిచేసింది..

ఇదీ చదవండి: మహిళలకు రేవంత్‌ సర్కార్‌ భారీ శుభవార్త.. ఉచితంగా చీరల పంపిణీ..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News