Music Shop Murthy Movie Review: ‘మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ’.. ప్రేక్షకులను మెప్పించిందా..!

Music Shop Murthy Movie Review: కమెడియన్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టులు,విలన్స్ హీరోలుగా చేయడం ఎప్పటి నుంచో ఉంది. తెలుగులో ఈ మధ్యకాలంలో కోట, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ల తర్వాత ఆ రేంజ్ విలనిజంతో అట్రాక్ట్ చేస్తోన్న నటుడు అజయ్ ఘోష్. ఆయన టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2024, 09:28 AM IST
Music Shop Murthy Movie Review: ‘మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ’.. ప్రేక్షకులను మెప్పించిందా..!

రివ్యూ: ‘మ్యూజిక్ షాప్ మూర్తి ’ (Music Shop Murthy)
నటీనటులు : అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని, భాను చందర్, అమిత్ శర్మ, దయానంద్ రెడ్డి, తదితరులు..
సంగీతం : పవవ్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగామ్
నిర్మాత : హర్ష గారపాటి, రంగారావు గారపాటి
రచన, దర్శకత్వం : శివ పాలడుగు

అజయ్ ఘోష్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. చాందని చౌదరి, ఆమని, భాను చందర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి మ్యూజిక్ షాప్ మూర్తిగా అజయ్ ఘోష్ ప్రేక్షకులను మెప్పించాడా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో మూర్తి (అజయ్ ఘోష్) పాత మ్యూజిక్ షాప్ నడిపిస్తుంటాడు. ఇంటర్నెట్ రాకతో ఆ వ్యాపారం దారుణంగా దెబ్బ తింటుంది. తనకు తెలిసిన పని అదే కాబట్టి.. పాత మ్యూజిక్ కలెక్షన్స్ తో పాటు పెళ్లిళ్లకు, బర్త్ డే పార్టీలకు మైక్ సెట్ లో పాటలను పెడుతూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే మూర్తి భార్య జయశ్రీ(ఆమని) భర్త ఆ పనిచేయకుండా.. కొత్తగా సెల్ ఫోన్ షాప్ పెట్టుకోమని నెత్తి నోరు బాదుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఇంట్లోనే మురుకులు తయారు చేస్తూ  అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో అంజనా (చాందిని చౌదరి) అమెరికాలో చదవుకున్న అమ్మాయి. డీజే కావాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి (భాను చందర్ ) కు అది ఇష్టం ఉండదు. తన ఇష్టానికి భిన్నంగా డీజే కావాలనుకుంటున్న కూతురు .. డీజే ఇన్ స్ట్రుమెంట్ పగలగొడతాడు. ఆ తర్వాత దాని రీపేర్ కోసం అనేక షాపులు తిరుగుతూ.. మూర్తి దగ్గరకు వస్తుంది. మూర్తి కూడా ఓ సందర్బంలో డీజే అయితే.. లక్షలు.. లక్షలు సంపాదించవచ్చనే ఆశతో 52 యేళ్ల వయసులో డీజే కావాలనుకుంటాడు. తన దగ్గరకు డిజే ఇన్ స్ట్రుమెంట్ తో వచ్చిన అంజనకు తనకు డీజే ఎలా వాయించాలో నేర్పమని చెబుతాడు. అటు మూర్తి భార్య, పెద్ద కూతురుకు అతను డీజే కావడం ఇష్టముండదు.  అటు తర్వాత అంజనా ఇంట్లో కనిపించకుండా పోతుంది. దానికి కారణం మూర్తి అంటూ అంజనా తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక డీజే కావాలనుకున్న మూర్తి కల ఎలా నెరవేరింది. అందుకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే ‘మ్యూజిక్ షాప్ మూర్తి ’ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
టాలెంట్ కు వయసుతో సంబంధం లేదు. సాధించాలనే తపన ఉంటే ఏజ్ పెద్ద విషయం కాదనే విషయం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ చెప్పే సారాంశం. అదే ఈ సినిమాలో ప్రేక్షకులను ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంగేజ్ అయ్యేలా చేయడంలో దర్శకుడు శివ పాలడుగు సక్సెస్ అయ్యాడు. గతంలో ఇలాంటి తరహా చిత్రాలు కొన్ని వచ్చినా.. ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలు రావడం అరుదనే చెప్పాలి. అంతేకాదు తాను ఎంచుకున్న కథకు ప్రేక్షకులకు నటనలో పెద్ద ఇమేజ్ లేని నటుడు అజయ్ ఘోష్ ను ఎంచుకోవడంతో సక్సెస్ అయ్యాడు. అతనిలో ఇంత మంచి నటుడు ఉన్న సంగతి ప్రేక్షకులను తెలియజేసాడు. ఇప్పటి వరకు అజయ్ ఘోష్ లో విలనిజం, కామెడీని చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో అతనిలో కరుణ, శాంతి, అద్భుత రసాలను పండించాడు. మరోవైపు మూర్తి పాత్రతో పాటు ఆమని పాత్రను, హీరోయిన్ చాందిని చౌదరి  పాత్రలను సమాంతరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆ పాత మధురులైనా పాటలను.. వాటిని ఆలపించిన సంగీత దర్శకులు, గాయకులను ఈ సినిమాలో హీరో షాప్  ఫోటోలో రూపంలో చూపించాడు. అంతేకాదు ఇంటర్నెట్ రాకతో ఒకపుడు కళకళ లాడిన క్యాసెట్, సీడీ షాపులు ఎలా మూత పడ్డాయనే  విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. అప్పటి వరకు వారికి తెలిసిన ఈ ఉపాధి రంగాన్ని విడిచిపెట్టి వేరే దాంట్లో ఆయా షాపుల వాళ్లు పడిన బాధలను మూర్తి రూపంలో ఆవిష్కరించాడు. మొత్తంగా ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలంటే సమాజంపై లోతైన అవగాహన ఉండాలి. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.  ఇందులో ఉన్న అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ అనవసరమైన పాత్ర అంటూ ఏది లేదు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కించాడు. ఇంటర్వెలో బ్యాంగ్ తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించాడు. ఇక చివరి ప్రీ క్లైమాక్స్ వరకు బాగనే తీసుకొచ్చినా.. క్లైమాక్స్ లో కొంచెం డ్రామా ఎక్కువైనట్టు ప్రేక్షకులకు కలుగుతోంది. సినిమా మొత్తం ఎమోషన్ క్యారీ చేసాడు. ఓవరాల్ గా ఎలాంటి అసభ్యకరంగా .. ఎలాంటి జుగుప్సా లేకుండా ఎంతో పద్దతిగా ఈ సినిమాను కుటుంబ  ప్రేక్షకులు చూసేలా ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

మరోవైపు ఈ సినిమా ఎడిటర్.. క్లైమాక్స్ విషయంలో తన కత్తెరకు కాస్త పదును పెడితే బాగుండేది. సంగీతం ఆకట్టుకునే విధంగా సినిమా స్టార్టింగ్ లో చిరు, బాలయ్యలతో మూర్తి చేసిన డీజే సాంగ్ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
మ్యూజిక్ షాప్ మూర్తి టైటిల్ పాత్రలో అజయ్ ఘోష్ నటించాడు అనే కంటే ఆ పాత్రలో జీవించాడు. ఇప్పటి వరకు ప్రేక్షకులు అజయ్ ఘోష్ ను చూసిన విధానం ఈ సినిమాలో పూర్తిగా మారిపోతుంది. ఒక కోట,రావు రమేష్, ప్రకాష్ రాజ్ ల నటనను కనబరిచాడు. ఈ సినిమాతో అజయ్ ఘోష్ కు నెగిటివ్ క్యారెక్టర్స్ కంటే పాజిటివ్ పాత్రలు వరించే అవకాశాలున్నాయి. ఇక అజయ్ ఘోష్ భార్య పాత్రలో నటించిన ఆమని.. శుభలగ్నం తర్వాత ఆ రేంజ్ నటన కనబరించింది. ఒక సగటు ఇల్లాలు పాత్రలో ఈ సినిమాను మోయడంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక చాందిని చౌదరి కూడా డీజే కావాలన్న తన కలను తల్లి దండ్రులు వద్దనడం.. ఆమె మూర్తికి డీజేపీలో శిక్షణ ఇవ్వడం వంటివి బాగున్నాయి. గామి తర్వాత ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. భానుచందర్ తో పాటు, అమిత్ శర్మ తన పాత్రలకు జీవం పోసారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

అజయ్ ఘోష్ నటన

కథనం

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్

స్లోగా సాగే నేరేషన్

క్లైమాక్స్

రేటింగ్..3/5

పంచ్ లైన్.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. టాలెంట్ కు వయసుతో సంబంధం లేదు..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News