Naga Chaitanya - Samantha : కలవబోతోన్న సమంత నాగ చైతన్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్

Naga Chaitanya And Samantha నాగ చైతన్య, సమంతల మీద నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి నాగ చైతన్య చలించిపోయాడట. కాల్ చేశాడట. కలిశాడట. అంటూ ఇలా నానా రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 04:16 PM IST
  • యశోద సినిమాతో ట్రెండింగ్‌లో సమంత
  • చై సామ్ మీద మరో కొత్త రూమర్ తెరపైకి
  • కలిసి త్వరలోనే నటించనున్నారంటూ టాక్
Naga Chaitanya - Samantha : కలవబోతోన్న సమంత నాగ చైతన్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్

Naga Chaitanya And Samantha : నాగ చైతన్య సమంత మళ్లీ కలుస్తారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సమంత మయోసైటిస్‌తో బాధపడుతోందని తెలిసిన వెంటనే నాగ చైతన్య ఫోన్ చేశాడని, యోగ క్షేమాలు అడిగారంటూ కొందరు వార్తలు రాసేశారు. లేదు లేదు నేరుగా ఆస్పత్రికి వెళ్లి సమంతను చూసి వచ్చాడంటూ ఇలా నానా రకాలుగా పిచ్చి రూమర్లన్నీ పుట్టుకొచ్చాయి. అలా నాగ చైతన్య, సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ఇక సమంత అయితే యశోద ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఎమోషనల్ ఇంటర్వ్యూ అందరినీ కదిలించింది. ఇక యశోద సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కూడా అయింది. అయితే ఇప్పుడు సమంత, నాగ చైతన్యల మీద మరో వార్త పుట్టుకొచ్చింది. ఇందులో ఎంత నిజముందో తెలియడం లేదు గానీ జాతీయ మీడియాలో వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

సమంత, నాగ చైతన్య కలవబోతోన్నారట. ఓ పెద్ద సినిమా కోసం ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారట. ఈ మేరకు వార్తలు లీక్ అయ్యాయి. అయితే ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్నది తెలియడం లేదు. ఎందుకంటే సమంత నాడు కరణ్‌ జోహర్‌ షోలో చెప్పిన విషయాలు అందరికీ తెలిసిందే. తమ ఇద్దరినీ ఒకే రూంలో ఉంచితే.. చుట్టు పక్కల కత్తుల్లాంటివి ఉంచకపోతే బెటర్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక నాగ చైతన్యను దూరం పెట్టినట్టుగా, కలిసి నటించేందుకు కూడా ఇష్టం వ్యక్తం చేయనట్టుగా మాట్లాడింది.

కానీ నాగ చైతన్య మాత్రం ఇంకోలా మాట్లాడాడు. ఆమె నాకు ఇప్పటికీ ఫ్రెండేనని, కలిస్తే హగ్ చేసుకుని మాట్లాడతాను అని చెప్పేశాడు. కలిసి నటిస్తారా? అని అడిగితే.. అవును. కానీ అది జరిగితే క్రేజీ అంటూ తన స్టైల్లో చైతూ చెప్పేశాడు. మరి ఈ ఇద్దరూ కలుస్తారా? కలిసి సినిమాల్లో నటిస్తారా? మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేస్తారా? అన్నది చూడాలి.

Also Read : Yashoda Overseas Collections : రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. సమంత యశోద జోరు మామూలుగా లేదు

Also Read : RRR సీక్వెల్.. మొదలుపెట్టిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ చెప్పిన రాజమౌళి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News