Nagarjuna: తెలుగులో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన ‘మురారి’ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అదే బాటలో నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన పాత సూపర్ హిట్ ‘మాస్’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా ఆగష్టు 28న ‘మాస్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాతో లారెన్స్ ను దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున సరసన జ్యోతిక, ఛార్మి కథానాయికలుగా నటించారు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇపుడీ చిత్రాన్ని నాగార్జున బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొన్నేళ్గుగా హీరోగా నాగార్జున ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఒకప్పటిలా నాగార్జున సినిమా అంటే ప్రేక్షకులు ఎగేసుకొని రావడం లేదు. అలాంటి సమయంలో ఈ రీ రిలీజ్ అవసరమా అని కొంత మంది నెటిజన్స్ నాగార్జున ను ప్రశ్నిస్తున్నారు.అటు చిరంజీవి, బాలయ్య నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఆయా హీరోల అభిమానులు పట్టించుకోలేదు. మరి నాగార్జున అభిమానులు పని కట్టుకొని యూట్యూబ్ లో ఫ్రీ గా ఉన్న ఈ సినిమాను 4Kలో చూసి ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
నాగార్జున విషయానికొస్తే.. ఈ యేడాది ‘నా సామిరంగా’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకలు ఆదరణ పొందింది. ప్రస్తుతం నాగార్జున .. ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కుబేరా’ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఈ యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు నాగార్జున బిగ్ బాస్ 8కు హోస్ట్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా రీ రిలీజ్ లలో యంగ్ హీరోలకు దక్కినట్టు నాగార్జున ‘మాస్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడా ? లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter