నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ఆఫీసర్ సినిమా విడుదల ఊహించినట్టుగానే వాయిదా పడింది. వాస్తవానికి మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా మే 25వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, సాంకేతిక కారణాల రీత్యా, సినిమాను మరింత ఆకర్షిణీయంగా ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం కోసం ఆఫీసర్ విడుదలను మే 25 నుంచి జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మనే స్వయంగా ప్రకటించాడు. సుధీర్ చంద్ర, రాంగోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆఫీసర్ సినిమాలో నాగ్ సరసన మైరా సరీన్ జంటగా నటిస్తోంది.

 

ముంబై మాఫియా వరల్డ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న సినిమా అని నిర్మాతలు మొదటి నుంచి చెబుతూ వస్తుండటం, అందులోనూ శివ, గోవిందా గోవిందా చిత్రాల తర్వాత మళ్లీ దశాబ్ధాల గ్యాప్ తీసుకుని ఈ ఇద్దరు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఆఫీసర్ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలే వున్నాయి. అభిమానుల అంచనాలను 'ఆఫీసర్' అందుకుంటాడో లేదో తెలియాలంటే జూన్ 1 వరకు వేచిచూడాల్సిందే.

English Title: 
Nagarjuna`s Officer postponed to June 1
News Source: 
Home Title: 

వెనక్కు వెళ్లిన 'ఆఫీసర్'

వెనక్కు వెళ్లిన 'ఆఫీసర్'
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
వెనక్కు వెళ్లిన 'ఆఫీసర్'