NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..

NBK@50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2024, 06:35 AM IST
NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..

NBK@50Years: టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోగా యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమలో 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి సినీ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బాలయ్య గొప్పతనాన్ని పొగిడారు. ఈ వేడుకకు
నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి,  కళాబందు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు,  మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌,  బోయపాటి శ్రీను, పి.వాసు, అల్లరి నరేష్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ..
తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాల కష్టం, 50 యేళ్లు సినిమాలు చేసినందుకు బాలయ్య అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాము. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్, అటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారికోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది.

అనిల్ రావిపూడి : బాలయ్యగారి  గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య  నుండి పుట్టేస్తాయ్.  బాడీ లాంగ్వేజ్ నుండి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయనాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం బాలయ్యకే  సాధ్యం.

బుచ్చి బాబు: ఈరోజు ఇంతకంటే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి ఉండదు. జై బాలయ్య అంటూ ముగించారు.

తమన్: అఖండ,వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు గాను నాకు చాలా సంతోషం ఆయనతో నాలుగు సినిమాలు చేసాను. త్వరలో 109 సినిమాతో పలకరించబోతున్నారు జై బాలయ్య.

మంచు విష్ణు : మీ గురించి చెప్పాలి అంటే సమయం సరిపోదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య  వల్లే. బాలకృష్ణ చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా  వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరు చేయలేదనే చెప్పాలి.

కందుల దుర్గేశ్ (ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్) : సుదీర్ఘకాలం పాటు నటించడం మాములు విషయం కాదు. అది కూడా 50 యేళ్ల  పాటు హీరోగా నటిస్తున్న వ్యక్తి బాలయ్య.  యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందదాయకం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా  ఏపీ ముఖ్యమంత్రి రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య సేవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News