Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం 'ఒక్క రాత్రి చాలు' అంటున్న బాలకృష్ణ

Nandamuri Balakrishna: గత కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు నందమూరి బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. మోక్షజ్ఞ సినిమా కోసం తనకి కేవలం ఒక్క రాత్రి చాలు అని అన్నారు బాలయ్య.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2023, 10:42 AM IST
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం 'ఒక్క రాత్రి చాలు' అంటున్న బాలకృష్ణ

Mokshagna: 

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సీనియర్ హీరోల కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది తెలుగులో హీరోలుగా పరిచయమయ్యారు. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నది నందమూరి బాలకృష్ణ తనకుడైన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా ఈ సినిమా చేయబోతున్నారు లేక ఆ సినిమా చేయబోతున్నారు అని ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు.

తాజాగా ఇప్పుడు బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ వచ్చే ఏడాది కచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని అన్నారు. దీని గురించి మాట్లాడుతూ "నా కొడుకు కరియర్ గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. తన ఫస్ట్ సినిమా ఎవరితో అనేది నాకు ఇంకా తెలియదు. నేను అలా ప్రిపేర్ అవ్వను. ఏదీ ప్లాన్ చేయను. రేపు షూటింగ్ అంటే కథ రెడీ అవ్వడానికి నాకు ఒక రాత్రి చాలు. నా స్పీడ్ ఎవరు తట్టుకోలేరు. మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి నాకు ఏమాత్రం దిగులు లేదు. ఎందుకంటే నా దగ్గర బోలెడు కథలు ఉన్నాయి," అని అన్నారు బాలకృష్ణ.

తన దగ్గర మంచి కథలు ఉన్నాయి కానీ మంచి డైరెక్టర్ కూడా కావాలని బాలయ్య ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందుకే మోక్షజ్ఞ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మోక్షజ్ఞ మొదటి సినిమా తనతోనే కావచ్చు అని కూడా హింట్ ఇచ్చారు. "ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం రెడీగా ఉంది. ఆ సినిమా కథ మొత్తం ఒక్క రాత్రిలో పూర్తి చేశాను. అది మాత్రమే కాకుండా మరొక కథ కూడా రెడీ చేసి పెట్టాను. కథలు ఉన్నాయి కానీ మంచి డైరెక్టర్ దొరకాలి అంతే," అని అన్నారు బాలకృష్ణ.

దీంతో నందమూరి అభిమానులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ మనవడిగా బాలకృష్ణ తనయుడిగా నందమూరి మోక్షజ్ఞ పై భారీగానే ఒత్తిడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఒక్కసారి మంచి సినిమాతో తనని హీరోగా పరిచయం చేస్తే మిగతా సినిమాలు మోక్షజ్ఞ తనకి తానుగా చేసుకోగలడు అని చెప్పారు బాలయ్య.

ఇక మరోవైపు బాలకృష్ణ వరుస సూపర్ హిట్ సినిమాలతో కరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత తాజాగా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో కూడా బాలకృష్ణ మంచి విజయాన్ని సాధించారు.

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x