Balakrishna 107 Movie update: బాలయ్య 107వ సినిమాకు ముహూర్తం ఫిక్స్​..

NBK new movie update: బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి అప్​డేట్ వచ్చింది. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. కాగా ఇది బాలకృష్ణకు 107వ సినిమా.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 01:03 PM IST
  • బాలయ్య 107వ సినిమాకు అంతా రెడీ
  • శనివారం నుంచి సినిమా షురూ
  • దర్శకత్వం గోపిచంద్ మాలినేని, మ్యూజిక్ తమన్​
Balakrishna 107 Movie update: బాలయ్య 107వ సినిమాకు ముహూర్తం ఫిక్స్​..

Nandamuri Balakrishna 107 Movie update: నందమూరి బాలకృష్ణ 107వ సినిమాకు మూహూర్తం కుదిరింది. ఈ శనివారం సినిమాను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers move with NBK)​ ఓ పోస్ట్​ను కూడా సోషల్​ మీడియాలో షేర్ చేసింది.

ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు (Gopichandh Malineni NBK movie) కాగా.. తమన్ ఎస్​​ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ట సరసరన శృతి హాసన్ హీరోయిన్​గా (Sruti Hassan with NBK) నటించనున్నారు. ఇతర నటీ నటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Also read: Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ

Also read: RRR: 'నాటు నాటు.. ఊర నాటు' సాంగ్ వచ్చేసింది..డ్యాన్స్‌ ఇరగదీసిన చరణ్-ఎన్టీఆర్..

వచ్చే నెల అఖండ రిలీజ్​?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ (Boyapati Srinu NBK movie) నటించిన తాజా చిత్రం అఖండ ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు (Akhanda movie latest updadates) సిద్ధమైనట్లు సినీవర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో అఖండ మూడో సినిమా. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాలీవుడ్ (Akanda release date) వర్గాలు చర్చించుకుంటున్నయి. అయితే దీనిపై సినిమా యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also read: Rashami Desai: బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ రష్మి దేశాయ్ హల్‌చల్ చేస్తున్న బోల్డ్ ఫోటోలు

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే సినిమాలోని టైటిల్ సాంగ్ (Akhanda New Song) ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో అఘోరాగా కనిపించిన బాలయ్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం రత్నం డైలాగ్స్ అందించారు.

Also read: Chiranjeevi Bhola Shankar Movie: భోళా శంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్.. కాస్ట్ అండ్ క్రూ ను ప్రకటించిన చిత్రబృందం

Also read: Telangana: రేపు విడుదలవుతున్న కేసీఆర్ బయోపిక్, సినిమాలో ఏముంది అసలు

సినిమాలే కాదు.. టాక్ షోలోనూ బాలయ్య అదుర్స్​..

ఇప్పటి వరకు సినిమాలతో అలరించిన బాలకృష్ణ.. ఇటీవలే టాక్​ షో కూడా చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహాలో 'అన్​స్టాపబుల్​' పేరుతో ఈ టాక్​ షో స్ట్రీమ్ అవుతోంది. దీపావళి సందర్భంగా మొదటి ఎపిసోడ్​ విడుదలైంది. మోహన్ బాబు గెస్ట్​గా వచ్చి సందడి చేశారు.

టాక్​ షోలో వ్యాఖ్యతగా బాలయ్య తన మార్క్​ను చాటుకున్నారు. రెండో ఎపిసోడ్​లో నాచ్యురల్ స్టార్ నాని గెస్ట్​గా విచ్చేశారు. ఇందుకు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది ఆహా టీమ్. త్వరలోనే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమ్​ కానుంది. నాని.. బాలకృష్ణ మధ్య ఫన్ని ముచ్చట్లతో సాగే ఈ ప్రోమో.. ఎపిసోడ్​పై అంచనాలు పెంచేసింది.

Also read: Ravi Teja Khiladi: 'ఖిలాడి'గా థియేటర్లలోకి రవితేజ.. ఎప్పుడంటే?

Also read: Adipurush Shooting Completed: 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News