Ravi Teja Khiladi: 'ఖిలాడి'గా థియేటర్లలోకి రవితేజ.. ఎప్పుడంటే?

Khiladi relesase date: రవి తేజ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్​. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి రిలీజ్ డేట్​ను ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 12:25 PM IST
  • రవి తేజ ఖిలాడి సినిమా నుంచి బిగ్ అప్​డేట్​
  • రిలీజ్​ డేట్ చెప్పేసిన చిత్ర యూనిట్​
  • థియేటర్లలో విడుదలవుతుందని స్పష్టం
Ravi Teja Khiladi: 'ఖిలాడి'గా థియేటర్లలోకి రవితేజ.. ఎప్పుడంటే?

Ravi Teja Khiladi: మాస్​ మహారాజా రవి తేజ హీరోగా నటిస్తున్న (Ravi Teja next Movie) 'ఖిలాడి' సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

2022 ఫిబ్రవరి 11న సినిమాను థియేటర్లలో (Khiladi release date) విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఖిలాడి అప్​డేట్స్​..

ఈ సినిమాలో రవితేజ డ్యూయల్​ రోల్​ పోషిస్తున్నారు. యాక్షన్​ థ్రిల్లర్​గా (Khiladi Movie updates) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్​లో రవితేజ అటు క్లాస్​, ఇటు మాస్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకునేలా కనిపించారు. పాట, బ్యాగ్రౌండ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ యూత్​ను ఆకట్టుకుంటోంది.

Also read: Adipurush Shooting Completed: 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’

ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. అందులో ఒకరు ఇటీవల హిట్​ టాక్​ తెచ్చుకున్న 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాలో నటించిన.. మీనాక్షీ చౌదరి కాగా మరొకరు డింపుల్ హయాతీ. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్​ అర్జున్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నట్లు తెలిసింది.

హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Also read: Chiranjeevi Bhola Shankar Movie: భోళా శంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్.. కాస్ట్ అండ్ క్రూ ను ప్రకటించిన చిత్రబృందం

Also read: Telangana: రేపు విడుదలవుతున్న కేసీఆర్ బయోపిక్, సినిమాలో ఏముంది అసలు

క్యూలో నాలుగు సినిమాలు..

ఈ సినిమాతో పాటు.. రవి తేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్​ నాగేశ్వర రావు సినిమాలు చేస్తున్నారు. 

ఈ సినిమాలే కాకుండా.. తాజాగా మరో కొత్త మూవీకి ఓకే చప్పారు రవి తేజ.  'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​, టైటిల్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'రావణాసుర' అనే టైటిల్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ (Ravi Teja New Movie 2021) విభిన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

ఫస్ట్ లుక్​ చూస్తే.. ఇందులో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. పాత్రకు తగ్గట్టు రవితేజ పది తలలతో కనిపించి, సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

ఇటీవల లాయర్​ పాత్రలకు అధిక ప్రాధాన్యత ఉన్న సినిమాల జోరు పెరిగిన నేపథ్యంలో రవి తేజ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్​.

Also read: Rashami Desai: బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ రష్మి దేశాయ్ హల్‌చల్ చేస్తున్న బోల్డ్ ఫోటోలు

Also read: Akhanda Release Date: బాలయ్య ‘అఖండ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!.. గ్రాండ్ రిలీజ్ కు చిత్రబృందం సన్నాహాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News