Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని

Nani Dasara Movie Release Date Announced: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సినిమా యూనిట్ రిలీజ్ డేట్ కూడా ఆ పోస్టర్ ద్వారానే ప్రకటించింది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 12:43 PM IST
Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని

Nani Dasara Movie Release Date Announced: చిన్న పెద్ద తేడా లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ విడుదలకు సిద్ధమైపోతూ ఉండటంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అలాగే ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు  కూడా అనౌన్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా, మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబో సహా మరికొన్ని సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు తాజాగా నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సినిమా యూనిట్ రిలీజ్ డేట్ కూడా ఆ పోస్టర్ ద్వారానే ప్రకటించింది. సింగరేణి గనుల నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ఆ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ సినిమాని మార్చి 30వ తేదీ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక విడుదల చేసిన పోస్టర్లో నాని ఒక మాస్ లుక్ లో పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తూ ఉండగా ఆయన వెనుక సిల్క్ స్మిత పెయింటింగ్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా రీ స్టార్ట్ అయింది. నిలిచిపోయిన సినిమాల షూటింగ్స్ చేసుకోవచ్చని ఫిలిం ఛాంబర్ అనుమతులు జారీ చేసిన క్రమంలో మళ్లీ షూట్ జరుగుతోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పుష్పా లాగానే ఒక లోకల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది.

Also Read: Venu swamy Comments on Vijay Devarakonda: వేణుస్వామి చెప్పిందే నిజమయింది.. లైగర్ దెబ్బతో మళ్ళీ వైరల్ అవుతున్న కామెంట్స్!

Also Read: Liger Movie Collections: డిజాస్టర్ టాక్ తో కూడా దుమ్ము రేపిన లైగర్ మూవీ.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News